Asianet News TeluguAsianet News Telugu

ముగింపు వేడుకలు మరింత స్పెషల్.. కొత్త తరహా సెలబ్రేషన్‌తో ఐపీఎల్-16ను ముగించనున్న బీసీసీఐ

IPL 2023 Closing Ceremony: ఐపీఎల్ -16 ముగింపు దశకు చేరింది. నేడు గుజరాత్ టైటాన్స్ - ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్ మ్యాచ్ తర్వాత ఫైనల్ జరుగనుంది. 

IPL 2023 Closing Ceremony: Vivian Divine and Nucleya perform in Ahmedabad MSV
Author
First Published May 26, 2023, 3:01 PM IST

రెండు నెలలుగా దేశవ్యాప్తంగా వివిధ నగరాలలో  జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 16వ ఎడిషన్ ముగింపు దశకు చేరింది.  ఈ సీజన్ లో ఇంకా మిగిలున్నవి రెండు మ్యాచ్‌లే.  నేడు (మే 26న)  అహ్మదాబాద్ వేదికగా  ముంబై ఇండియన్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య రెండో క్వాలిఫయర్  జరుగనుండగా..  ఈ మ్యాచ్ లో విజేత  మే 28న  చెన్నై సూపర్ కింగ్స్ తో ఇదే వేదికగాపై ఫైనల్ ఆడనుంది. ఈ సీజన్ కు గ్రాండ్ ఎండింగ్ ఇచ్చేందుకు  బీసీసీఐ  రెడీ అయ్యింది.  ఈసారి ముగింపు వేడుకలను  రొటీన్ గా కాకుండా   కాస్త డిఫరెంట్‌గా  చేయనున్నది. 

అహ్మదాబాద్ లో ఫైనల్ మ్యాచ్ లో ముగింపు వేడులకు గాను  ప్రముఖ ర్యాపర్స్ వివియన్ డివైన్, నుక్లెయ (ఉదయన్ సాగర్) లతో గానా బజానా ఏర్పాటు చేయనుంది. బీసీసీఐ గతేడాది మాదిరిగానే  స్పెషల్ లైట్ షో తో పాటు ఈసారి ఫైనల్ ఈవెంట్ లో  ఇద్దరు  ర్యాపర్ల ప్రదర్శన ఒకేసారి కాకుండా..  ఒకరిది మ్యాచ్ ప్రారంభానికి ముందు, మరొకరిది ఒక ఇన్నింగ్స్ (మిడ్ మ్యాచ్)  తర్వాత  జరిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఈ ఇద్దరే గాక ప్రముఖ గాయని జొనితా గాంధీ  కూడా  పర్ఫార్మ్ చేసే అవకాశముంది. 

 

బీసీసీఐ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. ప్రముఖ ర్యాపర్  వివియన్ డివైన్  ఐపీఎల్ - 16 ముగింపు వేడుకల్లో భాగంగా మ్యాచ్ కు ముందే  తన ప్రదర్శన ఇవ్వనున్నాడు.  ఇక మ్యాచ్ మొదలై ఒక ఇన్నింగ్స్ తర్వాత  నుక్లెయ.. 20 నిమిషాల పాటు తన ప్రదర్శనను ఇస్తాడు. ఈ తరహా  సెలబ్రేషన్స్ మనకు కొత్త అయినా  అమెరికా లో జరిగే అమెరికా ఫుట్‌బాల్ తో పాటు  నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్) లో  ఇది చాలా ఫేమస్. మిడ్ మ్యాచ్ సెలబ్రేషన్స్ అని పిలిచే వీటికి అక్కడ సక్సెస్ అయ్యాయి. ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడ్డాయి.  ఇప్పుడు ఇదే ప్లాన్ ను  బీసీసీఐ  ఐపీఎల్ లో ప్రవేశపెట్టబోతున్నది.   అయితే ఒక ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత  ఛేదన చేసే జట్టు ఎలా ఆడుతుందనే ఉత్సుకతతో ఉండే   ప్రేక్షకుడికి ఇది చిరాకు తెప్పించే అవకాశం కూడా లేకపోలేదు. 

ముగింపు వేడుకల వివరాలు.. 

- ఎక్కడ..? ఎప్పుడు..?

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా సాయంత్రం 6 గంటలకు మొదలవుతాయి.

- ప్రదర్శనలు ఇచ్చేది ఎవరు..? 

వివియన్ డివైన్, నుక్లెయ 

- చూడటమెలా..? 

ఈ  కార్యక్రమాన్ని  టీవీలు, మొబైల్స్ లో వీక్షించాలనుకుంటే..  ఐపీఎల్ టీవీ  బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ తో పాటు  మొబైల్ పార్ట్నర్   జియో  సినిమా యాప్ లో లైవ్ చూడొచ్చు.  

 

Follow Us:
Download App:
  • android
  • ios