ఆరెంజ్ క్యాప్ హోల్డర్ జోస్ బట్లర్‌తో కలిసి క్రేజీ స్టెప్పులు వేసిన పర్పుల్ క్యాప్ హోల్డర్ యజ్వేంద్ర చాహాల్... వీడియోను పోస్టు చేసిన రాజస్థాన్ రాయల్స్...
ఐపీఎల్ 2022 సీజన్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తోంది రాజస్థాన్ రాయల్స్. జోస్ బట్లర్ 588 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో నిలవగా, స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్ 19 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో దూసుకుపోతున్నాడు. గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన జోస్ బట్లర్, ఈ సీజన్‌లో ఇప్పటికే 3 సెంచరీలు చేసి... 500+ పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు.
65.33 యావరేజ్‌తో 150కి పైగా స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేస్తున్న జోస్ బట్లర్ ఖాతాలో మరో మూడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటికే 50 ఫోర్లు బాదిన జోస్ బట్లర్, 36 సిక్సర్లతో బౌండరీల విషయంలో టాప్‌లో ఉన్నాడు.
10 మ్యాచుల్లో 6 విజయాలు అందుకున్న రాజస్థాన్ రాయల్స్, మిగిలిన 4 మ్యాచుల్లో రెండింట్లో గెలిస్తే... వేరే ఫ్రాంఛైజీలతో సంబంధం లేకుండా నేరుగా ప్లేఆఫ్స్ చేరుతుంది. దీంతో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్లు ఖాళీ టైమ్‌ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ గడిపేస్తున్నారు...
అందులోనూ యజ్వేంద్ర చాహాల్ ఎక్కడుంటే అక్కడ సందడి, ఎంటర్‌టైన్‌మెంట్ టన్నుల్లో ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్ ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేసి, జోస్ బట్లర్‌తో కలిసి ఓపెనింగ్ చేస్తానంటూ తెగ హడావుడి చేసిన యజ్వేంద్ర చాహాల్, తాజాగా అతనితో కలిసి క్రేజీ స్టెప్పులతో ఇరగదీశాడు..
టిక్ టాక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో డ్యాన్స్ వీడియోలు పోస్టు చేసిన అనుభవం ఉన్న యజ్వేంద్ర చాహాల్ ఈజీగా ఫ్లోలో డ్యాన్స్ మూవ్స్ వేసుకుంటూ పోతే, జోస్ బట్లర్ అతన్ని అనుసరించాడు. ఆఖర్లో చాహాల్ సిగ్నచర్ పోస్టును కాపీ చేశాడు బట్లర్. ఈ వీడియోని ‘జోస్ అండ్ యూజీ. టూ గెదర్... డ్యాన్సింగ్ టు బల్లే ని బల్లే...’ అంటూ కాప్షన్ జోడించి పోస్ట్ చేసింది రాజస్థాన్ రాయల్స్ అధికారిక ఖాతా...
ఈ వీడియోపై క్రికెటర్ యజ్వేంద్ర చాహాల్ సతీమణి ధనశ్రీ వర్మ కామెంట్ చేసింది.‘నా మోస్ట్ ఫెవరెట్ రీల్... మై ఫెవరెట్స్... లవ్’ అంటూ కామెంట్ చేసిన ధనశ్రీ వర్మ... యజ్వేంద్ర చాహాల్, జోస్ బట్లర్‌లను ట్యాగ్ చేసింది. యజ్వేంద్ర చాహాల్ సతీమణి ధనశ్రీ వర్మ, ప్రముఖ యూట్యూబర్, కొరియోగ్రాఫర్. జోస్ బట్లర్, యజ్వేంద్ర చాహాల్ వేసిన డ్యాన్సు స్టెప్పులకు కూడా ధనశ్రీయే కొరియోగ్రాఫర్...
అయితే ధనశ్రీ వర్మ మాత్రం ఈ వీడియోలో కనిపించలేదు. దీనికి ప్రధాన కారణం బయో బబుల్ నిబంధనలు అమలులో ఉండడమే. అయితే గత సీజన్‌లో ధనశ్రీ వర్మతో కలిసి స్టెప్పులు వేసిన ప్లేయర్లు, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఆడిన భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. ఐపీఎల్ 2021 సీజన్ సమయంలో శ్రేయాస్ అయ్యర్‌తో పాటు శిఖర్ ధావన్‌తో కలిసి డ్యాన్స్ చేస్తూ వీడియోలు పోస్టు చేసింది ధనశ్రీ వర్మ...
ఈ ఇద్దరూ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఆడిన జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. దీంతో బట్లర్, చాహాల్ పర్ఫామెన్స్ ఎలా సాగుతుందోనని భయపడుతున్నారు రాయల్స్ ఫ్యాన్స్...
