ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుస వైఫల్యాల తర్వాత హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ... స్టాండ్స్‌లో నిలబడి భర్తను ఛీర్ చేసిన అనుష్క శర్మ..
మిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఖాతాలో ఇప్పటికే లెక్కలెక్కని రికార్డులు ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ తర్వాత క్రికెట్ ప్రపంచంలో అంతటి క్రేజ్ తెచ్చుకున్న విరాట్ కోహ్లీ, కొన్నాళ్లుగా సరైన ఫామ్‌లో లేడు... అంతర్జాతీయ క్రికెట్‌లో రెండున్నరేళ్లుగా సెంచరీ చేయలేకపోయిన విరాట్ కోహ్లీ, ఐపీఎల్ 2022 సీజన్‌లో మొదటి 9 మ్యాచుల్లో ఘోరంగా విఫలమయ్యాడు...
ఐపీఎల్ కెరీర్‌లో ఎప్పుడూ లేనట్టుగా రెండు సార్లు రనౌట్, వరసగా రెండు మ్యాచుల్లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు... విరాట్ కోహ్లీ ఇక రిటైర్మెంట్ తీసుకుంటే బెటర్ అంటూ కొందరు నెటిజన్లు ట్రోల్ చేయగా కొంతకాలం క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకుని రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని మాజీ క్రికెటర్లు సలహాలు ఇచ్చారు...
ఎట్టకేలకు సమయం తీసుకున్నా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన హాఫ్ సెంచరీతో తన ఫామ్‌ను ఘనంగా చాటుకున్నాడు విరాట్ కోహ్లీ... 45 బంతుల్లో కెరీర్‌లో 48వ ఐపీఎల్ హాఫ్ సెంచరీ బాదాడు... ఈ మ్యాచ్‌ను స్టాండ్స్‌లో నిల్చుని వీక్షించిన ఆయన సతీమణి అనుష్క శర్మ... విరాట్ కోహ్లీ కొట్టే షాట్స్‌ని చప్పట్లు కొడుతూ, అరుస్తూ భర్తను ఛీర్ చేసింది...
లూకీ ఫర్గూసన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ భారీ సిక్సర్ బాదగానే అనుష్క శర్మ, పెద్దగా అరుస్తూ భర్తను అభినందించింది. ఓ సాధారణ ఫ్యాన్‌లా విరాట్ సక్సెస్‌ని చూసి ఆనందపడింది అనుష్క. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత ఆకాశం వైపు చూస్తూ తండ్రిని గుర్తుచేసుకున్నాడు విరాట్ కోహ్లీ...
భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ పుట్టినరోజు రేపు. భార్యకు పుట్టినరోజు కానుకగా అడ్వాన్స్ గిఫ్ట్‌గా ఫామ్‌లోకి వచ్చి, తనపై వస్తున్న విమర్శలకు ఫుల్‌స్టాప్ పెట్టేశాడు విరాట్ కోహ్లీ... ఏడాది క్రితం ఓ బిడ్డకు జన్మనిచ్చిన అనుష్క శర్మ, ప్రస్తుతం పర్ఫెక్ట్ ఫిజిక్‌లోకి వచ్చేసింది. బ్లూ కలర్ జీన్స్, వైట్ కలర్ షర్ట్‌లో మెరిసిన అనుష్క శర్మ అందం... ఈ మ్యాచ్‌కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది..
బాలీవుడ్ నటి అయినా అచ్చు ఓ ఫ్యాన్ గర్ల్‌లా భర్త షాట్స్ కొడుతుంటే అనుష్క శర్మ ఎంజాయ్ చేసిన విధానం, చాలామంది క్రికెట్ అభిమానులకు తెగ నచ్చేసింది. డెలివరీ కోసం బాలీవుడ్ సినిమాల నుంచి ఏడాదిన్నర బ్రేక్ తీసుకున్న అనుష్క శర్మ, తిరిగి షూటింగ్‌లో పాల్గొంటోంది. ప్రస్తుతం భారత మహిళా సీనియర్ పేసర్ జులన్ గోస్వామి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘చక్దా ఎక్స్‌ప్రెస్’ మూవీలో నటిస్తోంది అనుష్క శర్మ...
ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో విరాట్ కోహ్లీ పాల్గొనడం లేదని, రెస్ట్ తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి పెద్దగా సమయం లేకపోవడంతో విరాట్ కోహ్లీ, ఈ సిరీస్‌లో పాల్గొంటేనే బెటర్ అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు..
