Asianet News TeluguAsianet News Telugu

IPL 2022: టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్... గెలిచినా, ఓడినా ఎవడికి ఉపయోగం...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ఇరు జట్లు, నామమాత్రపు మ్యాచ్‌గా మారిన 70వ మ్యాచ్... 

IPL 2022:  SunRisers Hyderabad won the toss and elected to bat against Punjab Kings
Author
India, First Published May 22, 2022, 7:05 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, పంజాబ్ కింగ్స్‌తో తలబడుతోంది. ఇప్పటికీ ఈ రెండు జట్లు ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నాయి. ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరే జట్లు కూడా నిర్ణయించబడ్డాయి. దీంతో నేటి మ్యాచ్‌ కేవలం నామమాత్రపు మ్యాచ్‌గానే మారింది... టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు...

ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 13 మ్యాచుల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉండగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా 13 మ్యాచుల్లో ఆరింట్లో గెలిచి 8వ స్థానంలో కొనసాగుతోంది. నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు టాప్ 6లోకి కచ్ఛితంగా చేరుతుంది. భారీ తేడాతో గెలిచి నెట్‌ రన్‌రేట్ మెరుగు పర్చుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్‌ని వెనక్కి నెట్టి టాప్ 5 పొజిషన్‌లోకి వెళ్లేందుకు కూడా అవకాశం ఉంటుంది...

పంజాబ్ కింగ్స్ 67 పరుగుల తేడాతో గెలిస్తే టాప్ 5లోకి వెళ్తుంది. లేదా సన్‌రైజర్స్ హైదరాబాద్ విధించిన లక్ష్యాన్ని 12 ఓవర్లలోపు ఛేదిస్తే టాప్ 5లోకి ఎంట్రీ ఇస్తుంది. అదే ఆరెంజ్ ఆర్మీ టాప్ 5లోకి రావాలంటే పంజాబ్‌పై 120 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకోవాల్సి ఉంటుంది. లేదా పంజాబ్ కింగ్స్ విధించిన లక్ష్యాన్ని 7 ఓవర్లలో ఛేదించాల్సి ఉంటుంది... 

నేటి మ్యాచ్‌లో ఓడిన జట్టు మాత్రం టాప్ 8లో మిగిలిపోతుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ కేన్ విలియంసన్ వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్‌ నుంచి స్వస్థలానికి వెళ్లిపోయాడు. దీంతో నేటి మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీకి కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్ వ్యవహరించబోతున్నాడు...

ఇరు జట్లకీ సీజన్‌లో ఇదే ఆఖరి మ్యాచ్ కావడంతో విజయంతో ముగించాలని ఆశపడుతున్నాయి. నేటి మ్యాచ్‌లో ఇరుజట్లు కొన్ని మార్పులతో బరిలో దిగాయి. పంజాబ్ కింగ్స్ జట్టు ద్వారా ప్రేరక్ మన్కడ్‌కి ఐపీఎల్‌లో తొలి అవకాశం దక్కింది...

అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.. సౌతాఫ్రికా సిరీస్‌లో చోటు దక్కించుకున్నట్టుగా ప్రకటన వచ్చిన తర్వాత జరగబోయే మ్యాచ్ కావడంతో ఈ ఇద్దరి పర్ఫామెన్స్‌లపై ఆసక్తి నెలకొంది. అలాగే సౌతాఫ్రికా సిరీస్‌లో చోటు దక్కించుకోలేకపోయిన రాహుల్ త్రిపాఠి నేటి మ్యాచ్‌లో ఎలా ఆడతాడనేది కూడా ఇంట్రెస్టింగ్‌గా మారింది...

మెగా వేలంలో రూ.7.75 కోట్లు పెట్టి కొన్న రొమారియో సిఫర్డ్‌ని మొదటి రెండు మ్యాచుల్లో ఆడించి, ఆ తర్వాత కూర్చోబెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్... ఆఖరి మ్యాచ్‌లో అతనికి అవకాశం ఇచ్చింది... మొదటి 2 మ్యాచుల్లో 3 వికెట్లు తీసిన రొమారియోతో పాటు రూ.10.75 కోట్లు పెట్టి కొన్న నికోలస్ పూరన్ నుంచి ఆ రేంజ్ ఒక్కటి వస్తే చూడాలని కోరుకుంటున్నారు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్...

పంజాబ్ కింగ్స్ జట్టు ఇది: జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, మయాంక్ అగర్వాల్, షారుక్ ఖాన్, జితేశ్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లీస్, ప్రేరన్ మన్కడ్, కగిసో రబాడా, అర్ష్‌దీప్ సింగ్

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: అభిషేక్ శర్మ, ప్రియమ్ గార్గ్, రాహుల్ త్రిపాఠి, అయిడిన్ మార్కర్‌మ్, నికోలస్ పూరన్, రొమారియో సిఫర్డ్, వాషింగ్టన్ సుందర్, జగదీశ సుచిత్, భువనేశ్వర్ కుమార్, ఫజల్‌హక్ ఫరూకీ, ఉమ్రాన్ మాలిక్

 

Follow Us:
Download App:
  • android
  • ios