Asianet News TeluguAsianet News Telugu

MS Dhoni: ధోనితో అంత వీజీ కాదు.. జడ్డూ నిష్క్రమణతో సోషల్ మీడియాలో పండుగ చేసుకుంటున్న మీమర్స్

Ravindra Jadeja Left CSK Captaincy: చెన్నై సూపర్ కింగ్స్  సారథ్య  బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు రవీంద్ర జడేజా శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ స్థానాన్ని మాజీ సారథి ధోనినే మళ్లీ భర్తీ చేయనున్నాడు. 

IPL 2022: Ravindra jadeja Step Down from Captaincy Role sparks Meme Fest, Fans Delighted With MS Dhoni's Return As skipper
Author
India, First Published May 1, 2022, 1:15 PM IST | Last Updated May 1, 2022, 1:15 PM IST

ఒత్తిడి తట్టుకోలేక  చెన్నై సూపర్ కింగ్స్ సారథ్య బాధ్యతల నుంచి అర్థాంతరంగా వైదొలిగాడు ఆ జట్టుకు 8 మ్యాచులలో  నాయకత్వం వహించిన రవీంద్ర జడేజా. తిరిగి వాటిని తన గురువు ధోనికే అప్పగించాడు. ‘ఈ తలనొప్పి నా వల్ల కాదు.. నువ్వే తీసుకో..’ అని తప్పుకున్నాడు. అయితే జడ్డూ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాక సోషల్ మీడియాలో మీమర్స్ పండుగ చేసుకున్నారు.  ముఖ్యంగా ధోని అభిమానులు, తమిళ తంబీలు తమ ‘తాలా’ మళ్లీ వచ్చాడని సంబురపడిపోయారు. ఈ క్రమంలో పలువురు మీమర్స్ ఆసక్తికర మీమ్స్ తో  అలరించారు.  

శనివారం సీఎస్కే తన ట్విటర్ ఖాతా వేదికగా స్పందిస్తూ.. ‘రవీంద్ర జడేజా తన ఆటపై పూర్తి దృష్టి  పెట్టాలని భావిస్తున్నాడు. అతడు ధోనినే మళ్లీ కెప్టెన్ గా ఉండాలని అభ్యర్థించాడు. జడేజా అభ్యర్థనకు ధోని అంగీకరించాడు..’ అని  రాసుకొచ్చిన విషయం తెలిసిందే. 

పలువురు మీమీర్స్ రవీంద్ర జడేజా పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ.. ‘ఆలోచించానన్నా (కెప్టెన్సీ గురించి..) ఇక నా వల్ల కాదు. నేను పోతా..’ ‘పది మ్యాచులకే  సీన్ అర్థం అయినట్టుంది. మరి 14 ఏండ్లుగా ధోని ఎలా నెగ్గుకొచ్చాడు జడ్డూ..’, ‘వీడు ఇలా చేస్తాడని నాకు ముందే తెలుసు (ధోని అనుకుంటున్నట్టు).. అనవసరంగా అప్పగించా’,‘ధోని వదిలేసి వెళ్లిన సింహాసనాన్ని అధిష్టించడమంటే అంత వీజీ అనుకున్నావా జడ్డూ...?’ అని కామెంట్ చేశారు. 

 

ఇక ధోని అభిమానులైతే ‘కింగ్ ఈజ్ బ్యాక్..’ తో పాటు కేజీఎఫ్ 2 లోని  వాయిలెన్స్ డైలాగ్ ను ధోనికి అన్వయించారు. ‘కెప్టెన్సీ, కెప్టెన్సీ.. ఐ డోన్ట్ లైక్. ఐ అవాయిడ్. కానీ కెప్టెన్సీ లైక్స్ మీ..  ఐ కాంట్ అవాయిడ్..’ ను   ఎక్కువ మంది షేర్, రీట్వీట్ చేశారు. 

మరికొంతమంది.. ‘ధోని తిరిగి  తన  సింహాసనానికి చేరుకుంటున్నాడు. ఇక సర్ జడేజా తన పాత స్థానానికే పరిమితమవుతాడు.. ఇదీ మంచిదే..’ అని రాసుకొచ్చారు. ఇక చెన్నై అభిమానుల్లో పలువురు ఉత్సాహకులు మాత్రం.. ‘మా తాలా మళ్లీ కెప్టెన్ అయ్యాడు.  సీఎస్కే రాత మారడం ఖాయం. ఇక ప్లేఆఫ్స్ కు వెళ్లడమే తరువాయి..’ అని ఉత్సాహం  ప్రదర్శించారు. 

 

 

ఇదిలాఉండగా ఈ సీజన్ లో 8 మ్యాచులాడిన సీఎస్కే.. 2 విజయాలు, 6 పరాజయాలతో 4 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది.  ఆ జట్టు మిగిలిన మ్యాచులు సన్ రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ తో ఆడాల్సి ఉంది.  ఆదివారం హైదరాబాద్ తో ఆ జట్టు కీలక పోరులో తలపడనున్నది.   ప్లేఆఫ్ చేరాలంటే సీఎస్కే.. ఇకపై జరుగబోయే ప్రతి మ్యాచ్ నెగ్గాల్సి ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios