Asianet News TeluguAsianet News Telugu

IPL: ఆ రికార్డు బ్రేక్ చేసిన ఐపీఎల్-2022.. బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న బ్యాటర్లు

IPL 2022 Stats: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ ఎడిషన్ ఫ్యాన్స్ ను ఏ మేర అలరిస్తుందో గానీ రికార్డులైతే  బద్దలవుతున్నాయి. ఈసారి రెండు కొత్త జట్లు చేరడంతో  ఎంటర్టైన్మెంట్ డబుల్ అయింది. 

IPL 2022 Breaks Most Sixes in Season, will it Crossed 1000 Mark?
Author
India, First Published May 16, 2022, 6:30 PM IST

మహారాష్ట్ర వేదికగా సాగుతున్న ఐపీఎల్-2022 సీజన్ టీఆర్పీ రేటింగ్ లు లేవని, మ్యాచులన్నీ ఏకపక్షంగా సాగుతూ బోర్ కొట్టిస్తున్నాయని వాదనలు వినిపిస్తున్నాయి.  ప్రేక్షకులను మోకాళ్ల మీద  కూర్చోబెట్టే మ్యాచులు లేవని, సూపర్ ఓవర్ల ఊసే లేదని వాపోయే వాళ్లూ లేకపోలేదు. అయితే  ఎవరేమన్నా ఈసారి రెండు కొత్త జట్లు చేరడంతో ఐపీఎల్ అభిమానులకు ఎంటర్టైన్మెంట్ అయితే డబుల్ అయిందనేది కాదనలేని వాస్తవం.  ఈ సీజన్ లో బద్దలవుతున్న  పలు రికార్డులే అందుకు సాక్ష్యం. ఐపీఎల్-15లో బ్యాటర్లు, బౌలర్లు అనే తేడా లేకుండా వచ్చినోళ్లు వచ్చినట్టు సిక్సర్లు బాదుతుండటంతో ఈ జాబితాలో  కొత్త రికార్డు నమోదైంది. 

ఐపీఎల్-15 లో ఇప్పటివరకు (రాజస్తాన్-లక్నో మ్యాచ్ ముగిశాక)  885 సిక్సర్లు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్ లో ఇన్ని సిక్సర్లు నమోదవడం ఇదే తొలిసారి.  అంతకుముందు 2018 లో 872 సిక్సర్లు బాదారు. 

ఐపీఎల్ సీజన్ లో సిక్సర్ల  రికార్డు :

- 2022 : 885 
- 2018 : 875
- 2019 : 784
- 2020 : 734 

 

వెయ్యి నమోదయ్యేనా..?? 

ఐపీఎల్-15లో  మొత్తం 74 మ్యాచులుండగా ఇప్పటికే 885 సిక్సర్లు బాదిన  ఆటగాళ్లు.. మరో 115 కొట్టడం పెద్ద విషయమేమీ కాదు. అలా అయితే సింగిల్ సీజన్ లో వెయ్యి సిక్సర్లు నమోదవడం ఖాయం. 

ఈ సీజన్ లో లాంగెస్ట్ సిక్సెస్ : 

- లియామ్ లివింగ్ స్టోన్ (పీబీకేఎస్) .. 117 మీటర్లు.. మహ్మద్ షమీ (గుజరాత్) బౌలింగ్ లో 
- డెవాల్డ్ బ్రెవిస్ (ముంబై).. 112 మీటర్లు.. రాహుల్ చాహర్ (పంజాబ్) బౌలింగ్ లో 
- లివింగ్ స్టోన్ (పంజాబ్).. 108 మీటర్లు.. ముఖేశ్ చౌదరి (చెన్నై) బౌలింగ్ లో 
- పూరన్ (హైదరాబాద్).. 108 మీటర్లు.. నోర్త్జ్ (ఢిల్లీ) బౌలింగ్ లో 
- జోస్ బట్లర్ (రాజస్తాన్).. 107 మీటర్లు.. శార్దూల్ (ఢిల్లీ) బౌలింగ్ లో  

 

Follow Us:
Download App:
  • android
  • ios