Asianet News TeluguAsianet News Telugu

ధావన్, దినేశ్ కార్తీక్ ల మధ్య ఏం జరిగింది..?

దినేష్ కార్తీక్ వచ్చిన విపరీతమైన కోపాన్ని.. శిఖర్ ధావన్ చిటికెల్ పోగొట్టాడు. ధావన్ ఔట్ చేశానంటూ దినేశ్ కార్తీక్.. అంపైర్ అప్పీల్ కోసం వేచి చూస్తుండగా.. ధావన్ వెంటనే ఇచ్చిన రియాక్షన్ తో దినేశ్ కార్తీక్ నవ్వేశాడు. దీనికి సంబంధించిన వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది.

IPL 2021: Shikhar Dhawan Drops To His Knees On Dinesh Karthik's Cue In Hilarious Banter. Watch
Author
Hyderabad, First Published Apr 30, 2021, 1:44 PM IST


ఐపీఎల్ సందడి కొనసాగుతోంది. లైవ్ లో స్టేడియం కి వెళ్లి చూసే అవకాశం లేకపోయినా.. ఇంట్లో కూర్చొని చూస్తూ అభిమానులు ఆనందపడుతున్నారు. కాగా.. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్ లో చివరికి విజయం ఢిల్లీనే వరించింది. కాగా.. ఈ మ్యాచ్ లో భాగంగా శిఖర్ ధావన్, దినేశ్ కార్తీక్ ల మధ్య ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

దినేష్ కార్తీక్ వచ్చిన విపరీతమైన కోపాన్ని.. శిఖర్ ధావన్ చిటికెల్ పోగొట్టాడు. ధావన్ ఔట్ చేశానంటూ దినేశ్ కార్తీక్.. అంపైర్ అప్పీల్ కోసం వేచి చూస్తుండగా.. ధావన్ వెంటనే ఇచ్చిన రియాక్షన్ తో దినేశ్ కార్తీక్ నవ్వేశాడు. దీనికి సంబంధించిన వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by IPL (@iplt20)

ఇంతకీ మ్యాటరేంటంటే... అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో శిఖర్ ధావన్‌ని స్టంపౌట్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్.. ఔట్ అంటూ సీరియస్‌గా అరిచేశాడు. దాంతో.. శిఖర్ ధావన్ రెస్పాన్స్ చూసిన ఫీల్డ్ అంపైర్ అనిల్ కుమార్ చౌదరి కూడా షాక్ అయిపోయాడు.

ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మూడో బంతిని లెగ్ స్టంప్‌కి కాస్త వెలుపలగా విసిరాడు. దాంతో ఆ బంతిని స్వీప్ చేయబోయిన శిఖర్ ధావన్.. బ్యాట్‌కి బంతి తాకకపోవడంతో క్రీజులో కాస్త బ్యాలెన్స్ తప్పాడు. అదే అదునుగా బంతిని అందుకున్న వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ రెప్పపాటులో స్టంపౌట్ చేసి.. శిఖర్ ధావన్ వైపు చూస్తూ ఔట్ అంటూ సీరియస్‌గా అరిచాడు. దినేశ్ కార్తీక్ తన వైపు సీరియస్‌గా చూసి ఔటని అనడంలో శిఖర్ ధావన్ కూడా ఒక్కసారిగా బ్యాట్ వదిలేసి మోకాళ్లపై కూర్చుండిపోయాడు. అందరూ తొలుత షాకైనా.. తర్వాత వారిద్దరూ సరదాగా చేశారని తెలిసి నవ్వేసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios