Asianet News TeluguAsianet News Telugu

IPL 2021: సాయం కాలానా.. సాగర తీరానా.. సంధ్యా సూర్యుడితో బుమ్రా భార్య.. ఫోటో తీసిందెవరంటే..!

Sanjana Ganesan: భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను తన యార్కర్లతో క్లీన్ బౌల్డ్ చేసి కొంగున ముడేసుకుంది సంజనా గణేషన్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె తాజాగా దుబాయ్ లో సాయం కాలం వేళ సాగర తీరాన నిలుచుని తీయించుకున్న ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. 

ipl 2021 rr vs mi indian pacer jasprit bumrah wife sanjana ganesan sizzles on the beach photos clicked by his bestie
Author
Hyderabad, First Published Oct 5, 2021, 11:42 AM IST

ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా యార్కర్ల దాడికి ఔట్ కాని బ్యాట్స్మెన్ ఉండడంటే అతిశయోక్తి కాదు. కానీ అదే బుమ్రా.. సంజనా గణేషన్ వేసిన యార్కర్లకు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. గతేడాది సంజనాతో బుమ్రా పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. క్రికెట్ ప్రెజెంటర్ అయిన సంజనా కూడా ప్రస్తుతం భర్తతోనే దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్నది. తాజాగా ఈ జంట దుబాయ్ లోని ఓ బీచ్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. 

ఎండలు ఠారెత్తిస్తున్న దుబాయ్ లో చల్లని సాయం కాల వేళ బయటకు వెళ్లడం తప్పనిసరి. రోజంతా ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరయ్యే అక్కడి జనం సాయంత్రం కాగానే బీచ్ ల వైపునకు పరిగెడుతుంటారు. బుమ్రా, సంజనలు కూడా అలా సాయం కాలవేళ ప్రకృతిని ఎంజాయ్ చేయడానికి బయటకు వచ్చారు.

 

బీచ్.. ఇక సెలవు తీసుకుంటానని వెళ్లబోతున్న సూర్యుడు..  చల్లని గాలి.. ప్రకృతి మోస్ట్ రొమాంటిక్ గా ఉండటంతో ఖజురహో శిల్పం మాదిరి ఫోజుచ్చిన సంజనాను బుమ్రా క్లిక్ మనిపించాడు. ఆ ఫోటోను ఆమె ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ‘ఈ ఫోటో తీసింది ఎప్పటికీ నాతో ఉండే నా బెస్ట్ ఫ్రెండ్’ అని రాసుకొచ్చింది. దీనికి సంజన, బుమ్రాల ఫ్యాన్స్ స్పందిస్తూ.. ‘సారు (బుమ్రా) ఎప్పటికీ క్రెడిట్ ఇవ్వకపోయినా మేడమ్ మాత్రం ఆ విషయాన్ని అస్సలు మరిచిపోదు..’ అంటూ కామెంట్ చేశాడు. ఇన్స్టాలో 635K ఫాలోవర్స్ ఉన్న సంజనా.. నిత్యం తన ఫోటోలు, బుమ్రాకు సంబంధించిన సంగతులు, ఇతర విషయాలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది. ఇదిలాఉండగా.. ముంబయి ఇండియన్స్ నేడు రాజస్థాన్ రాయల్స్ తో కీలక పోరుకు సన్నద్దమవుతున్నది. ప్లే ఆఫ్స్ కు  చేరుకోవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానున్నది. 

Follow Us:
Download App:
  • android
  • ios