Asianet News TeluguAsianet News Telugu

అంపైర్ వార్నింగ్.. బౌలింగ్ స్టైల్ మార్చిన రియాన్ పరాగ్

టీమిండియా మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌.. అశ్విన్‌ బౌలింగ్‌ను  తప్పుబట్టాడు.  ఆఫ్‌ స్పిన్‌ను వదిలేసి ఈ బౌలింగ్‌ వేస్తున్నావేంటి బాబూ అని విమర్శించాడు.

IPL 2021: Riyan Parag Bowls Undercutter To Chris Gayle, Gets Warning From Umpire
Author
Hyderabad, First Published Apr 13, 2021, 8:45 AM IST

ఆర్మ్ బౌలింగ్.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినపడుతోంది. బ్యాట్స్ మెన్ ను కన్ ఫ్యూజ్ చేసేందుకు బౌలర్లు ఈ రకం టెక్నిక్ ని వాడుతున్నారు. ఇటీవల రవిచంద్రన్ అశ్విన్,  కేదార్ జాదవ్ లు ఇలా బౌలింగ్ చేసిన వారే.. 

ఈ ఐపీఎల్ సీజన్ లోనూ అశ్విన్ రెండుసార్లు ఇలాంటి బౌలింగ్ చేసి విమర్శలపాలయ్యాడు. టీమిండియా మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌.. అశ్విన్‌ బౌలింగ్‌ను  తప్పుబట్టాడు.  ఆఫ్‌ స్పిన్‌ను వదిలేసి ఈ బౌలింగ్‌ వేస్తున్నావేంటి బాబూ అని విమర్శించాడు. తాజాగా రాజస్తాన్‌ రాయల్స్‌ స్పిన్నర్‌ రియాన్‌ పరాగ్‌ కూడా ఈ తరహా బౌలింగ్‌ వేయబోయాడు. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో భాగంగా గేల్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు రౌండ్‌ ఆర్మ్‌ బౌలింగ్‌కు యత్నించాడు పరాగ్‌. 


10 ఓవర్‌ మూడో బంతిని రౌండ్‌ ఆర్మ్‌ బంతిగా వేశాడు. ఆ క్రమంలో అతని మోచేతి గ్రౌండ్‌కు దాదాపు సమాంతరంగా ఉండటంతో అంపైర్‌ రంగంలోకి దిగాడు.  ఆ బంతిని ఉద్దేశిస్తూ.. జాగ్రత్త.. అంతలా రౌండ్‌ ఆర్మ్‌ బౌలింగ్‌ వేస్తే నిబంధనలకు విరుద్ధమయ్యే అవకాశం ఉందని వార్నింగ్‌ ఇచ్చాడు. దాంతో వెంటనే పరాగ్‌ బౌలింగ్‌ యాక్షన్‌ మార్చేశాడు. తన మునపటి స్టైల్‌ బౌలింగ్‌ వేశాడు. అయినప్పటికీ క్రిస్‌ గేల్‌ వికెట్‌ను సాధించాడు,. ఆ ఓవర్‌ ఐదో బంతిని గేల్‌ భారీ షాట్‌ ఆడగా బెన్‌ స్టోక్స్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టాడు.  లాంగాన్‌ వైపు భారీగా కొట్టిన ఆ షాట్‌ను స్టోక్స్‌ జారవిడచకుండా పట్టుకోవడంతో గేల్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. దాంతో 40 పరుగుల వ్యక్తి గత స్కోరు డేంజర్‌ మ్యాన్‌ గేల్‌ పెవిలియన్‌ చేరాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios