Asianet News TeluguAsianet News Telugu

IPL 2021: ఆర్సీబీ ఓడినా హర్షల్ పటేల్ ఖాతాలో నయా రికార్డు

విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ (ఆర్సీబీ) బౌలర్ హర్షల్ పటేల్ ఐపిఎల్ 2021లో రికార్డు సృష్టించాడు. ఓ సీజన్ లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా బ్రేవోతో పాటు అగ్రస్థానంలో నిలిచాడు.

IPL 2021: RCB bowler Harshal Patel creates record
Author
Sharjah - United Arab Emirates, First Published Oct 12, 2021, 8:11 AM IST

షార్జా: విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బౌలర్ హర్షద్ పటేల్ కొత్త రికార్డును సృష్టించాడు. Virat Kohli జట్టు ఎలిమినేటర్ మ్యాచులో ఓడిపోయినప్పటికీ Harshal Patel ఐపిఎల్ 2021లో అరుదైన ఘనతను సాధించాడు. ఓ IPL మ్యాచులో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ అతను రికార్డు సృష్టించాడు. 

మొత్తం 15 మ్యాచులు ఆడిన హర్షల్ పటేల్ 32 వికెట్లు తీసుకున్నాడు. ఇందులో ఓ హ్యాట్రిక్ కూడా ఉంది. దాంతో అతను చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) బౌలర్ డ్వైన్ బ్రావోతో సమానంగా అగ్రస్థానంలో నిలిచాడు. 

Dwene Bravo 2013 ఐపిఎల్ లో CSK తరఫున ఆ సీజన్ లో 32 వికెట్లు తీసుకున్నాడు. హర్షల్ పటేల్, బ్రావోల తర్వాత రెండో స్థానంలో కగిసో రబడ ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న రబడ 2020 ఐపిఎల్ సీజన్ లో 30 వికెట్లు పడగొట్టాడు. మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో జేమ్స్ ఫాల్కనర్, లసిత్ మలింగ, బుమ్రా ఉన్నారు. 

Also Read: IPL2021 RCB vs KKR: కేకేఆర్ ముందుకి, ఆర్‌సీబీ ఇంటికి... ఐపీఎల్ టైటిల్ లేకుండానే విరాట్ కోహ్లీ...

జేమ్స్ ఫాల్కనర్ 2013 ఐపిఎల్ సీజన్ లో 28 వికెట్లు తీయగా, లసిత్ మలింగ 2011 సీజన్ లో 28 వికెట్లు తీశాడు. బుమ్రా 2020 సీజన్ లో 27 వికెట్లు తీసుకున్నాడు. 

కాగా, కీలకమైన ఎలిమినేటర్ మ్యాచులో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని ఆర్సీబీ సునీల్ నరైన్ బౌలింగ్ కు చేతులెత్తేసింది. తన స్పిన్ మంత్రంతో ఆర్సీబీ బ్యాట్స్ మెన్ ను కట్టడి చేసిన నరైన్ ఆ తర్వాత బ్యాటింగులోనూ దూకుడు ప్రదర్శించి ఆర్సీబీకి చుక్కలు చూపించాడు సోమవారం జరిగిన మ్యాచులో కొల్ కతా నైట్ రైడర్స్ ఆర్సీబీపై నాలుగు వికెట్ల తేడాతో ఓడించి క్వాలిఫయర్ -2కు చేరుకుంది. 

Also Read: IPL 2021: అంపైర్లతో విరాట్ కోహ్లీ గొడవ... వికెట్ల ముందు పడుతున్నా కనిపించడం లేదా అంటూ...

ఆర్సీబీ ఐపిఎల్ 2021 నుంచి తప్పుకుంది. బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 139 పరుగుుల చేసింది. క్యాలిఫయర్ -2లో కేకేఆర్ రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ను ఎదుర్కుంటుంది. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించి ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ కు చేరుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios