Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ నిరవధిక వాయిదా... ఇదేమీ జోక్ కాదంటూ రైనా ట్వీట్..!

రైనా ఈ ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ నిరవధిక వాయిదాతో.. ఇంటికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో.. ప్రస్తుత పరిస్థితి వివరించారు.

IPL 2021: "Not A Joke Anymore," Suresh Raina Tweets On India's COVID-19 Crisis
Author
Hyderabad, First Published May 5, 2021, 8:59 AM IST

కరోనా మహమ్మారి దెబ్బ.. ఐపీఎల్ పై కూడా పడింది. ఈ మహమ్మారి బారిన క్రికెటర్లు ఎవరూ పడకుండా ఉండేందుకు బీసీసీఐ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. కానీ.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కొందరు క్రికెటర్లకు కరోనా సోకింది. ఈ నేపథ్యంలో.. ఐపీఎల్ ని నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో.. ఈ వార్త క్రికెట్ ప్రియులను,ఐపీఎల్ అభిమానులను ఎంతగానో కలచివేసింది. కనీసం స్టేడియంలో చూసి సంబరపడకపోయినా.. టీవీల్లో చూసి ఆనందపడాలని అనుకున్నారు. అయితే.. ఆ ఆశలకు కూడా కరోనా గండి వేసింది. 

ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం ఉన్న పరిస్థితిపై టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాడు సురేష్ రైనా స్పందించారు. దేశంలో కరోనా పరిస్థితి దారుణంగా ఉందని.. ప్రతి ఒక్కరూ చాలా సీరియస్ గా తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ప్రజలను చైతన్య పరుస్తూ.. రైనా వరస ట్వీట్లు చేశారు.

రైనా ఈ ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ నిరవధిక వాయిదాతో.. ఇంటికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో.. ప్రస్తుత పరిస్థితి వివరించారు.

ఇప్పుడున్న పరిస్థితిని ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదని పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితిని జోక్ గా తీసుకోకూడదని హెచ్చరించారు. ఈ వైరస్ కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఎవరు ఎంత సహాయం చేస్తున్నారన్నది మ్యాటర్ కాదని రైనా పేర్కొన్నాడు. ఒకరి ప్రాణాలు కాపాడేందుకు మరొకరు నిలుస్తున్నారని.. వారందరికీ తాను సెల్యూట్ చేస్తున్నట్లు రైనా చెప్పారు.

 

ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా సెకండ్ వేవ్ భయంకరంగా ఉంది. భారత్ లో మొత్తం కరోనా కేసులు 2కోట్లకు చేరుకుంది. ప్రతిరోజూ తక్కువలో తక్కువ 3లక్షల మందికి పాజిటివ్ గా తేలుతోంది. ఇక మరణాల సంఖ్య కూడా అంతేవిధంగా భయపెడుతుండటం గమనార్హం. 

సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ వృద్దిమాన్ సాహా కి కరోనా పాజిటివ్ గా నిర్థారన అయ్యింది.  కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) ఆటగాళ్ళు - వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కి కూడా కరోనా సోకింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios