Asianet News TeluguAsianet News Telugu

IPL2021: ఇయాన్ మోర్గాన్ కి భారీ జరిమానా..!

మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా.. కెప్టెన్ మోర్గాన్ కి భారీ జరిమానా విధించారు. మోర్గాన్‌కి రూ.24 లక్షలు, టీమ్‌లోని ఆటగాళ్లకి రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25% కోత (ఏది తక్కువ ఉంటే అది) పడింది.

IPL 2021, MI vs KKR: Kolkata skipper Eoin Morgan, his playing XI fined for slow over-rate
Author
Hyderabad, First Published Sep 24, 2021, 10:21 AM IST


ఐపీఎల్ (IPL2021) లో కోల్ కతా నైట్ రైడర్స్ (kolkata knight riders) కి  మాంచి కిక్ ఇచ్చే విజయం దక్కింది. అందరూ ముంబయి ఇండియన్స్( Mumbai Indians) గెలుస్తుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా విజయం కోల్ కతాకే దక్కింది. ఈ జట్టు విజయం దక్కింది కానీ.. ఆ జట్టు క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ కి మాత్రం ఊహించని షాక్ ఎదురైంది.

మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా.. కెప్టెన్ మోర్గాన్ కి భారీ జరిమానా విధించారు. మోర్గాన్‌కి రూ.24 లక్షలు, టీమ్‌లోని ఆటగాళ్లకి రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25% కోత (ఏది తక్కువ ఉంటే అది) పడింది. ఐపీఎల్ 2021 సీజన్‌లో కోల్‌కతా ఇలా స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడటం ఇది రెండోసారి. దాంతో.. జరిమానా రెట్టింపైంది.

మ్యాచ్‌లో డికాక్ హాఫ్ సెంచరీ బాదడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఆ తర్వాత.. కోల్‌కతా జట్టులో రాహుల్ త్రిపాఠి (74 నాటౌట్: 42 బంతుల్లో 8x4, 3x6), వెంకటేశ్ అయ్యర్ (53: 30 బంతుల్లో 4x4, 3x6) మెరుపు హాఫ్ సెంచరీలు బాదడంతో.. ఆ జట్టు 15.1 ఓవర్లలోనే 159/3తో విజయాన్ని అందుకుంది. సీజన్‌లో 9వ మ్యాచ్ ఆడిన కోల్‌కతా టీమ్‌కి ఇది నాలుగో గెలుపుకాగా.. ముంబయి ఇండియన్స్‌కి ఇది ఐదో ఓటమి.

గురువారం రాత్రి కేటాయించిన సమయంలోపు వేయాల్సిన ఓవర్ల కంటే కోల్‌కతా నైట్‌రైడర్స్ ఒక ఓవర్‌ని తక్కువగా వేసింది. దాంతో.. ఆ జట్టుకి జరిమానా పడింది. వాస్తవానికి సీజన్‌లో మొదటి తప్పిదానికి కెప్టెన్‌కి రూ. 12 లక్షల జరిమానా పడనుండగా.. రెండో సారి స్లో ఓవర్ రేట్ తప్పిదం చేస్తే.. ఆ జరిమానా రెట్టింపుకానుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios