నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు తీసిన దీపక్ చాహార్...ఓ వికెట్ మెయిడిన్ ఓవర్‌తో రికార్డు స్పెల్... చాహార్ ధాటికి కుప్పకూలిన పంజాబ్ టాపార్డర్...

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదుచేశాడు చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ దీపక్ చాహార్. మొదటి ఓవర్‌లోనే మయాంక్ అగర్వాల్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన దీపక్ చాహార్, ఆ తర్వాత క్రిస్ గేల్, దీపక్ హూడా, డేంజరస్ బ్యాట్స్‌మెన్ పూరన్ వికెట్లు తీసి.. పంజాబ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు.

4 ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసిన దీపక్ చాహార్, ఓ మెయిడిన్ ఓవర్ కూడా వేశాడు. అయితే దీపక్ చాహార్ అదిరిపోయే పర్ఫామెన్స్‌కి మహ్మద్ షమీయే కారణమని అంటున్నారు నెటిజన్లు. ఇలా అనడానికి ఓ కారణం ఉంది.

మ్యాచ్ ప్రారంభానికి ముందు మహ్మద్ షమీని చూసిన వెంటనే, కాళ్లను మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు దీపక్ చాహార్. కాళ్లు మొక్కబోయిన దీపక్ చాహార్‌ను నవ్వుతూ అడ్డుకున్న మహ్మద్ షమీకి, నిన్నటి మ్యాచ్‌ 100వ టీ20.

దీంతో షమీ దీవెనలతోనే అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడని ఫన్నీ పోస్టులు పెడుతున్నారు కొందరు అభిమానులు. మరోవైపు 4 ఓవర్లలో 21 పరుగులు మాత్రమే ఇచ్చిన మహ్మద్ షమీ కూడా took ఒకే ఓవర్‌లో సురేశ్ రైనా, అంబటి రాయుడు వికెట్లు తీశాడు.