ఐపీఎల్ సందడి మొదలైంది. ఈ సీజన్ లో టైటిల్ ఫేవరేట్ చెన్నై సూపర్ కింగ్స్.. తొలి మ్యాచ్ లో సత్తా చాటింది. కానీ.. తర్వాతి రెండు మ్యాచుల్లో తడపడింది. దీంతో.. అభిమానులు కలవరపడుతున్నారు. చెన్నై జట్టు ఎలాగైనా గెలవాలని తపనపడుతున్నారు. ఇప్పటికే గాయంతో అంబటి రాయుడు జట్టుకి దూరమయ్యాడు. ఇక.. పర్సనల్ రీజన్స్ తో సురేష్ రైనా కూడా జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో.. రైనా మళ్లీ జట్టులోకి అడుగుపెట్టాలని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

 ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 44 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. చెన్నై ఓపెనర్లు విఫలమైన వేళ మిడిలార్డర్‌లో డుప్లెసిస్‌కు సరైన సహకారం అందకపోవడం.. అంబటి రాయుడు, సురేశ్‌ రైనాలు లేని లోటు స్పష్టంగా కనిపించింది.

దీంతో.. రైనా మళ్లీ జట్టులోకి రావాలంటూ అభిమానులు విన్నపం చేస్తున్నారు. తొలుత ఐపీఎల్ కోసం రైనా దుబాయి చేరుకున్నాడు. అయితే.. వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ వదిలేసి వెళ్లాల్సి వచ్చింది. చెన్నై తరపున ఎన్నో రికార్డులు సాధించిన ఘటన రైనా ది. కాగా.. ఇప్పుడు మ్యాచ్ లో రైనా లేకపోవడంతో.. ఆ తేడా స్పష్టంగా కనపడుతోంది.  అందుకే.. అభిమానులు రైనా మళ్లీ రావాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి వారి కోరిక మేరకు రైనా మళ్లీ వస్తాడో లేదో చూడాలి.