Asianet News TeluguAsianet News Telugu

SRH VS RR: బెన్ స్టోక్స్ ఈజ్ బ్యాక్, రాజస్థాన్ మ్యాజిక్ చేయగలదా..?

అంచనాలకు అందని ఫామ్‌లో ఉన్న బెన్‌ స్టోక్స్‌ రాకతో.. వరుస నాలుగు ఓటముల పరంపరకు బ్రేక్‌ పడుతుందని రాజస్థాన్‌ రాయల్స్‌ ఆలోచన. ఆరు మ్యాచుల్లో రాజస్థాన్‌ రెండు విజయాలే సాధించగా.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆరు మ్యాచుల్లో మూడు విజయాలతో ముందుకు సాగుతోంది. 

IPL 2020: SRH VS RR Match preview, Stats, Head To Head, Fantasy Picks Pitch Report And  Probable Playing Eleven
Author
Dubai - United Arab Emirates, First Published Oct 11, 2020, 9:00 AM IST

ప్రపంచ క్రికెట్‌ సూపర్‌స్టార్‌ ఆల్‌రౌండర్‌, ప్రతి జట్టూ కోరుకునే కలల రారాజు బెన్‌ స్టోక్స్‌ ఐపీఎల్‌ 2020లో తొలి మ్యాచ్‌కు రెఢీ అవుతున్నాడు. న్యూజిలాండ్‌ నుంచి వచ్చిన బెన్‌ స్టోక్స్‌ శనివారమే క్వారంటైన్‌ను ముగించుకున్నాడు. నేటి మ్యాచ్‌కు ముందు రాజస్థాన్‌ శిబిరంలో చేరి ప్రాక్టీస్‌ సైతం మొదలుపెట్టాడు. 

అంచనాలకు అందని ఫామ్‌లో ఉన్న బెన్‌ స్టోక్స్‌ రాకతో.. వరుస నాలుగు ఓటముల పరంపరకు బ్రేక్‌ పడుతుందని రాజస్థాన్‌ రాయల్స్‌ ఆలోచన. ఆరు మ్యాచుల్లో రాజస్థాన్‌ రెండు విజయాలే సాధించగా.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆరు మ్యాచుల్లో మూడు విజయాలతో ముందుకు సాగుతోంది. 

నేడు దుబాయ్‌లో మధ్యాహ్నాం 3.30 గంటలకు హైదరాబాద్‌, రాజస్థాన్‌లు తలపడనున్నాయి. స్టార్‌స్పోర్ట్స్‌, డిస్నీ హాట్‌స్టార్‌లలో మ్యాచ్‌ ప్రసారం కానుంది.

వీరుడు వచ్చాడు!

షార్జాలో రెండు విజయాలతో ఈ సీజన్‌ రాజస్థాన్‌దే అనిపించింది. కానీ వరుసగా నాలుగు మ్యాచుల్లో పరాజయాలు ఆ జట్టు ఆత్మవిశ్వాసం దెబ్బతీసింది. ఓడిన ప్రతి మ్యాచ్‌లోనూ రాజస్థాన్‌కు కొత్త సమస్యలు ఎదురయ్యాయి. ఇప్పుడు బెన్ స్టోక్స్‌ రాకతో లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ తురుపు ముక్కతో పాటు బౌలింగ్‌లో అదనపు వనరు అందుబాటులోకి రానుంది. 

ఇక 2019 ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌పై శతకబాదిన సంజు శాంసన్‌.. నేడూ అదే ప్రదర్శన పునరావృతం చేస్తాడేమో చూడాలి. జోస్ బట్లర్‌, స్టివ్‌ స్మత్‌లు టచ్‌ కోల్పోయారు. యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ ఆత్మవిశ్వాసంతో కనిపించలేదు. కానీ మైదానంలో యశస్వి మెరుపు ఫీల్డింగ్‌తో రనౌట్లు చేశాడు. 

ప్రతిభావంతుడైన యువ ఓపెనర్‌నే కొనసాగిస్తారా? లేక సీనియర్ రాబిన్‌ ఉతప్పను ఓపెనర్‌గా బరిలోకి దింపుతారా అనేది చూడాలి.

రెగ్యులర్‌ సన్‌రైజర్స్‌ బ్యాక్‌!

ఓపెనర్లు డెవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌స్టో ధనాధన్ ఇన్నింగ్స్‌లు. మిడిల్‌ ఆర్డర్‌లో కేన్‌ విలియమ్సన్‌ ఎటాకింగ్‌ ఫినిషింగ్‌. స్పిన్‌ గన్‌ రషీద్‌ ఖాన్‌ మ్యాజికల్‌ స్పెల్‌. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజయాల్లో సహజంగా కనిపించే సీన్‌ ఇది. 

ఐపీఎల్‌ 2020లో ఆరెంజ్‌ ఆర్మీ ఇప్పుడిప్పుడే ఈ సీన్‌లోకి వస్తోంది. గత మ్యాచ్‌లో వార్నర్‌, బెయిర్‌స్టో కళ్లుచెదిరే ప్రదర్శన చేశారు. మిడిల్‌ ఆర్డర్‌లో మనీశ్‌ పాండే మళ్లీ భారీ షాట్లు ఆడటంలో ఇబ్బంది పడుతున్నాడు. 

నేటి మ్యాచ్‌లో అతడూ రేసులోకి వస్తే హైదరాబాద్‌ మరింత పోటీ ఇవ్వగలదు. భువనేశ్వర్‌ కుమార్‌ లేకపోయినా సందీప్‌ శర్మ, టి నటరాజన్‌లు పేస్‌ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నారు.

వ్యూహంలో ఇవి..!

1.రాజస్థాన్‌ రాయల్స్‌ స్టార్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ ఐపీఎల్‌లో తనదైన భారీ ఇన్నింగ్స్‌ ఆడనేలేదు. అతడు ఫామ్‌లోకి వస్తే నిలువరించటం ఎవరి తరం కాదు. కానీ పవర్‌ ప్లేలో రషీద్‌ ఖాన్‌ను ప్రయోగిస్తే బట్లర్‌ బాధ హైదరాబాద్‌కు ఉండనే ఉండదు. 2018 ఐపీఎల్‌ నుంచి రషీద్‌ ఖాన్‌ 8 బంతులను ఎదుర్కొన్న జోస్ బట్లర్‌ 4 పరుగులు చేసి. 4 సార్లు వికెట్‌ కోల్పోయాడు. అందులో రెండు క్లీన్‌ బౌల్డ్‌లు ఉన్నాయి.

2.ఇంగ్లాండ్‌ స్టార్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ బంతులను ఎదుర్కొవటంలో డెవిడ్‌ వార్నర్‌ పడిన తంటాలను ప్రత్యక్షంగా చూశాడు స్మిత్‌. ఇంగ్లాండ్‌, ఆసీస్‌ వన్డే సిరీస్‌లో ఆర్చర్‌ వార్నర్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు.  నేటి మ్యాచ్‌లో వార్నర్‌పైకి ఆర్చర్‌ను ప్రయోగించి అతడి కథ ముగించే ఆలోచనలో ఉంది రాజస్థాన్‌. ఆర్చర్‌ 145 కిమి వేగంతో వార్నర్‌కు బాడీ లైన్‌ బౌన్సర్లు సంధిస్తే.. అది అభిమానులకు కనువిందే!.

ప్లేయింగ్‌ ఎలెవన్‌ (అంచనా)

రాజస్థాన్‌ రాయల్స్‌ : జోస్‌ బట్లర్‌ (వికెట్‌కీపర్‌), రాబిన్‌ ఉతప్ప/యశస్వి జైస్వాల్‌, సంజు శాంసన్‌, స్టీవ్‌ స్మిత్‌ (కెప్టెన్‌), బెన్‌ స్టోక్స్‌, మహిపాల్‌ , రాహుల్‌ తెవాటియ, శ్రేయాస్‌ గోపాల్‌, జోఫ్రా ఆర్చర్‌, వరుణ్‌ అరోన్‌, కార్తీక్‌ త్యాగి.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: డెవిడ్‌ వార్నర్‌ (కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో (వికెట్‌ కీపర్‌), మనీశ్‌ పాండే, కేన్‌ విలియమ్సన్‌, ప్రియమ్‌ గార్గ్‌, అబ్దుల్‌ సమద్‌, అభిషేక్‌ శర్మ, రషీద్‌ ఖాన్‌, టి.నటరాజన్‌, ఖలీల్‌ అహ్మద్‌, సందీప్‌ శర్మ/బసిల్‌ తంపీ.   

Follow Us:
Download App:
  • android
  • ios