కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ అసలు ఐపీఎల్ జరుగుతుందా లేదా అని అభిమానులంతా నిరాశపడిపోయారు. ఎప్పుడెప్పుడు ఐపీఎల్ సీజన్ ప్రారంభం అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. వారి ఎదురుచూపులకు ఎట్టకేలకు పులిస్టాప్ పడింది. అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ సందడి మొదలైంది.

ఇప్పటికే రెండు మ్యాచ్ లు అయిపోయాయి కూడా. తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించగా.. రెండో మ్యాచ్ లో ఢిల్లీ సూపర్ విజయం సాధించింది. కాగా.. ఆ తర్వాతి మ్యాచ్ కోసం ఆర్సీబీ రెడీ అవుతోంది.  నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. కాగా.. ఈ మ్యాచ్ పై సన్ రైజర్స్ జట్టు క్రికెటర్ , లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఆదివారం మీడియాతో మాట్లాడారు.

ఈ మ్యాచ్ లో కోహ్లీ కి బౌలింగ్ చేయడాన్ని తాను గర్వంగా ఫీలౌతానంటూ చెప్పడం విశేషం. రషీద్.. విరాట్ కి బిగ్ ఫ్యాన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. కాగా.. ఇప్పుడు వీరిద్దరూ ప్రత్యర్థులుగా బరిలోకి దిగనున్నారు. దీంతో.. ఈ విషయమై ఆయనను మీడియా ప్రశ్నించగా.. కోహ్లీకి బౌలింగ్ చేయడం గర్వగా భావిస్తానని సమాధానం ఇచ్చాడు. ఇక   ఈ మ్యాచ్ లో విజయం సాధించడానికి తాను శాయశక్తులా ప్రయత్నిస్తానని రషీద్ తెలిపాడు. 

‘ మ్యాచ్ అనగానే నా బుర్రలో ఒకే ఒక్క విషయం ఉంటుంది.  ఇన్నింగ్స్ లో మూడు లేదా నాలుగు ఓవర్లు మిగిలి ఉన్నప్పుడు.. ఉత్తమ ప్రదర్శన ఇవ్వలను అని అనుకుంటాను. ఇక మ్యాచ్ లో పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి. నేను బిగ్ బాష్ ఆడుతున్నప్పుడు, 15 ఓవర్ల మార్క్ తర్వాత నేను ఎలా వెళ్లాలి అని కోచింగ్ సిబ్బంది నాకు చెప్పారు. కోచ్ మరియు కెప్టెన్ నుండి మీకు ఇంత మంచి స్పందన వచ్చినప్పుడు, ఇది చాలా మంచిది "అని రషీద్ పేర్కొన్నాడు.


"నేను బ్యాటింగ్ చేయగలనని పెద్దగా ఆలోచించకూడదు, మొత్తం మ్యాచ్‌లో నేను ఏమి చేయగలను అనే దానిపై నేను దృష్టి పెట్టాలి, జట్టుకు బాగా రాణించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను" అని ఆయన అన్నారు.