క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్-2020 షెడ్యూల్‌ను నిర్వాహకులు విడుదల చేశారు. మార్చి 29న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్‌కింగ్స్ తలపడనున్నాయి.

ప్రస్తుతానికి లీగ్ మ్యాచ్‌ల షెడ్యూల్‌నే విడుదల చేయగా.. నాకౌట్ మ్యాచ్‌ల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. మే 17న చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది. అయితే ఫైనల్ డేట్‌పై మాత్రం క్లారిటీ వచ్చేసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం మే 24న తుదిపోరు జరుగుతుందని తెలుస్తోంది.

Also Read:కోహ్లీకి స్వేచ్ఛనివ్వండి, కప్ తెస్తాడు: విజయ్ మాల్యా ఆసక్తికర వ్యాఖ్య

గతంతో పోలిస్తే ఈ సారి డబుల్ హెడర్ మ్యాచ్‌లు ( ఒకే రోజు సాయంత్రం 4 గంటలకు, రాత్రి 8 గంటలకు రెండు మ్యాచ్‌లు నిర్వహించడం) సంఖ్యను కుదించారు. ఇప్పుడు తొలి రోజు, చివరి రోజు మినహాయించి మిగిలిన ఆదివారాల్లో మాత్రమే డబుల్ హెడర్‌ మ్యాచ్‌లు జరుగుతుతాయి.

దీంతో లీగ్ మ్యాచ్‌ల సంఖ్య పెరిగింది. 2019 వరకు 44 రోజుల్లో లీగ్ మ్యాచ్‌లు జరగ్గా.. అది ఇప్పుడు 50కి పెరిగింది. ఏ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ మినహా మిగిలిన ఏడు జట్లు తమ సొంత వేదికలను కొనసాగించనున్నాయి. రాజస్థాన్ మాత్రం జైపూర్‌తో పాటు రెండు మ్యాచ్‌లను గౌహతికి మార్చాలని నిర్ణయించింది. అయితే దీనిపై కోర్టులో వివాదం నడుస్తోంది. 

Also Read:ఆర్సీబీ కొత్త లోగో... చూసి షాకైన కోహ్లీ

ఇక తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ సంగతికి వస్తే హోం మ్యాచ్‌లను ఎప్పటిలాగే ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలోనే ఆడనుంది. హైదరాబాద్‌లో ఈ ఏడు మ్యాచ్‌లు ఏప్రిల్ 1, 12, 16, 26, 30 మే 5, 12 తేదీల్లో జరుగుతాయి. ఇతర వేదికల్లో హైదరాబాద్ జట్టు 4, 7, 19, 21, మే 3, 9, 15 తేదీల్లో ప్రత్యర్థులను ఢీకొంటుంది.

సన్ రైజర్స్ తన తొలి మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్‌తో ఏప్రిల్ 1న ఆడనుంది. 2019 ఐపీఎల్ ఫైనల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఒక్క పరుగు తేడాతో విజయం సాధించి, నాలుగోసారి ట్రోఫీని సాధించి రికార్డు సృష్టించింది. 

ఐపీఎల్ పూర్తి షెడ్యూల్: