ఐపీఎల్‌‌లో విరాట్‌ కోహ్లీ నాయకత్వంలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు బోణీ చేసింది. యుజ్వేంద్ర చాహల్‌, నవదీప్ సైనిలు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో సన్‌రైజర్స్‌ జట్టును పది పరుగుల తేడాతో ఓడించగలిగింది.

విరాట్‌ జట్టు 164 పరుగుల లక్ష్యాన్ని ఇవ్వగా, 19.4 ఓవర్లకు 153 పరుగులు మాత్రమే చేసి సన్‌‌రైజర్స్‌ జట్టు కుప్ప కూలింది.రాయల్‌ ఛాలెంజర్స్‌లో చాహల్‌ మూడు, శివం దుబే, సైని రెండేసి వికెట్లు తీశారు. దీంతో.. విజయం ఆర్సీబీని వరించింది.

కాగా.. ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ గెలవడం పట్ల ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ ని మొత్తం మలుపుతిప్పింది యజ్వేంద్ర చాహల్.. అని మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది. కాగా.. ఇదే విషయాన్ని కోహ్లీ తెలిపాడు. చాహల్ గేమ్ ఛేంజర్ అని.. ఆట మొత్తాన్ని మార్చేశాడని కెప్టెన్ కోహ్లీ పేర్కొన్నాడు.

తన స్కిల్స్ అన్నీ.. చాహల్ నిన్నటి మ్యాచ్ లో బయటపెట్టాడని.. అందుకే ఆటనే మొత్తం మార్చేశాడంటూ కోహ్లీ పేర్కొన్నాడు. కాగా.. బెయిర్‌స్టో స్పీడ్ కి చాహల్ బ్రేకులు వేశాడు.బెయిర్‌స్టో 43 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్సర్ల సహాయంతో 61 పరుగులు చేశాడు.

ఖాతా కూడా తెరవని విజయ్‌శంకర్‌ను తరువాతి బంతితో చాహల్ అవుట్‌ చేశాడు. నాలుగు ఓవర్లలో చాహల్ 18 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా మూడు వికెట్లు తీసి.. జట్టు విజయానికి చాహల్ సహాయం చేశాడు. దీంతో.. ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు చాహల్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.