సెప్టెంబర్ 19 నుంచి ఆరంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ కోసం అన్ని జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాయి.

ఈ క్రమంలో ఐపీఎల్ 13వ సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ తమ ఆటగాళ్ల  కోసం కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఫ్రాంఛైజీ రెడ్‌బుల్ స్కైడైవింగ్, వింగ్ సూట్ అథ్లెట్‌ డానీ రోమన్‌తో జెర్సీని వినూత్నంగా రిలీజ్ చేయించింది.

యూఏఈలోని ఒక బీచ్‌లో స్కైడైవర్ విమానం నుంచి దూకుతూ డానీ రోమన్ కొత్త జెర్సీని ఆవిష్కరించారు. అనంతరం దుబాయ్‌లోని రాయల్ మిరాజ్ రిసార్ట్ వద్ద దిగిన రోమన్.. రాజస్థాన్ ఆటగాళ్లకు కొత్త జెర్సీ అందజేశాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్థాన్ రాయల్స్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. 2018లో ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన రాజస్థాన్.. తాజా సీజన్‌లో తన తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది.