ఈ క్రమంలో విరాట్‌ను విమర్శిస్తూ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సునీల్ గవాస్కర్ అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేశాడు. డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడాడు. లాక్‌డౌన్ సమయంలో కోహ్లీ అనూష్క శర్మ బంతులతో ఇంట్లో ప్రాక్టీస్ చేశాడు అంటూ ఓ హాట్ కామెంట్ విసిరాడు.
భారత దిగ్గజ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్‌పై బాలీవుడ్ హీరోయిన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కోహ్లీ ఆట గురించి సునీల్ గవాస్కర్ డబుల్ మీనింగ్ కామెంట్ చేయగా.. దానికి అనుష్క కౌంటర్ ఇచ్చింది. కాగా.. సునీల్ గవాస్కర్ కి ఇర్ఫాన్ పఠాన్ మద్దతుగా నిలవడం గమనార్హం.
ఇంతకీ మ్యాటరేంటంటే.. కింగ్స్‌ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ నేతృత్వం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఘోర ఓటమి చవిచూసింది. కెప్టెన్‌గా ముందుండి నడిపించాల్సిన కోహ్లీ.. అటు ఫీల్డింగ్, ఇటు బ్యాటింగ్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు.
ఈ క్రమంలో విరాట్‌ను విమర్శిస్తూ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సునీల్ గవాస్కర్ అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేశాడు. డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడాడు. లాక్‌డౌన్ సమయంలో కోహ్లీ అనూష్క శర్మ బంతులతో ఇంట్లో ప్రాక్టీస్ చేశాడు అంటూ ఓ హాట్ కామెంట్ విసిరాడు.
దీనిపై అనుష్క చాలా సీరియస్ అయ్యింది. మిస్టర్ సునీల్ గవాస్కర్ మీ వ్యాఖ్యలు చాలా అసహ్యకరంగా ఉన్నాయి. భర్త గేమ్‌ను నిందించడానికి భార్యను లాగుతూ.. డబుల్ మీనింగ్ వాఖ్యలు ఎందుకు చేస్తారు? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వస్తుంది. కామెంటేటర్‌గా ప్రతీ క్రికెటర్ వ్యక్తిగత జీవితాలను మీరు గౌరవిస్తారనుకుంటున్నా. అప్పుడు నా పట్ల మీకు అలాంటి గౌరవం లేదా? గత రాత్రి నా భర్త ఆటతీరుపై వ్యాఖ్యానించడానికి మీ వద్ద చాలా పదాలు, కామెంట్స్ ఉండే ఉంటాయి. కానీ వాటికి నాపేరును ఉపయోగిస్తేనే మీ విమర్శలు పవర్ ఫుల్‌గా ఉంటాయనుకున్నారా?’ అంటూ కౌంటర్ ఇచ్చింది.
కాగా.. దీనిపై ఇర్ఫాన్ పఠాన్ స్పందిచాడు. ‘‘ ఎప్పటికీ మీ మీద గౌరవం ఉంటుంది సునీల్ గవాస్కర్ సర్’’ అంటూ ఇర్ఫాన్ ట్వీట్ చేశాడు.
