భారత క్రికెట్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకు ఓ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో అదరగొట్టే హార్ధిక్ పాండ్యా, ప్రస్తుతం ముంబై ఇండియన్స్ తరుపున ఐపీఎల్‌లో పాల్గొంటున్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటిదాకా తన రేంజ్ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు పాండ్యా.

వెన్నెముక ఆపరేషన్ తర్వాత తిరిగి ఫామ్ అందుకోవడానికి ఇబ్బంది పడుతున్న పాండ్యా, బాలీవుడ్ హీరోయిన్ నటాశా స్టాన్కోవిక్‌తో ఈ ఏడాది జనవరిలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. పెళ్లి కాకముందే ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది నటాశా. నటాశా, పాండ్యాలకు ఆగస్టు 2న కొడుకు పుట్టాడు. ఐపీఎల్ కోసం ప్రియురాలు, కొడుకుని వదిలి దుబాయ్ చేరుకున్న హార్ధిక్ పాండ్యా, వారిని బాగా మిస్ అవుతున్నాడట.

 

 

నెలన్నర వయసులోనే టీవీ చూస్తున్నాడట బుల్లి పాండ్యా. కొడుకు టీవీ చూస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన పాండ్యా, ‘మై ఛీర్ స్వాడ్’ అని కామెంట్ చేశాడు. కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో పాండ్యా హిట్ వికెట్ రూపంలో అవుటైన సంగతి తెలిసిందే.