Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ స్పాన్సర్షిప్ హక్కులను దక్కించుకున్న డ్రీమ్11

బీసీసీఐ ఐపీఎల్ స్పాన్సర్షిప్ హక్కులను ఫాంటసీ క్రికెట్ లీగ్ డ్రీమ్11 కి అప్పగించింది. ఇప్పటికే ఐపీఎల్ కి అసోసియేట్ స్పాన్సర్ గా ఉన్న డ్రీమ్ 11 టాటా సన్స్ ను తోసిరాజేసి 250 కోట్లకు స్పాన్సర్షిప్ హక్కులను దక్కించుకుంది. 

IPL 2020: Dream11 Is The New Title Sponsor
Author
Mumbai, First Published Aug 18, 2020, 3:26 PM IST

ఐపీఎల్ స్పాన్సర్షిప్ నుండి వివో తప్పుకున్నది మొదలు, తదుపరి హక్కులను ఎవరు దక్కించుకుంటారన్న  నెలకొంది. బైజూస్‌, జియో, అమెజాన్‌, అన్‌అకాడమీ, డ్రీమ్‌ 11, మైసర్కిల్‌ 11 తదితర కంపెనీలు ఆసక్తి ఈ హక్కులను దక్కించుకోవడానికి పోటీపడ్డాయి. 

అన్ని ఊహాగానాలకు తెరదించుతూ బీసీసీఐ ఐపీఎల్ స్పాన్సర్షిప్ హక్కులను ఫాంటసీ క్రికెట్ లీగ్ డ్రీమ్11 కి అప్పగించింది. ఇప్పటికే ఐపీఎల్ కి అసోసియేట్ స్పాన్సర్ గా ఉన్న డ్రీమ్ 11 టాటా సన్స్ ను తోసిరాజేసి 250 కోట్లకు స్పాన్సర్షిప్ హక్కులను దక్కించుకుంది. 

ప్రధాన స్పాన్సర్ హక్కులు దక్కడంతో అసోసియేట్ స్పాన్సర్ గా డ్రీమ్ 11 కొనసాగుతుందా, లేదా బీసీసీఐ వేరే స్పాన్సర్ కోసం వెతుకుతుందా అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. అసోసియేట్ స్పాన్సర్ గా డ్రీమ్ 11 40 కోట్లను చెల్లిస్తూ ఉండేది. 

ఆన్ లైన్ లెర్నింగ్ ప్లాట్ ఫారం అన్ అకాడెమి 210 కోట్లు, టాటా సన్స్ 180 కోట్లు, బైజూస్ 125 కోట్లుతో ముందుకు వచ్చినప్పటికీ.. బీసీసీఐ డ్రీం 11 కి స్పాన్సర్షిప్ హక్కులను అందించింది. డబ్బు ఒకటే ప్రాధాన్యత కాదన్న బీసీసీఐ చివరకు  ఆ డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనబడుతుంది. 

ఇకపోతే.... గాల్వాన్ లోయaలో చైనా దురాగతానికి వ్యతిరేకంగా, చైనా దుష్టనీతిని నిరసిస్తూ చైనా వస్తువుల బహిష్కరణ నినాదం ఊపందుకున్న విషయం తెలిసిందే. దీనితో సోషల్ మీడియాలో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ వివోపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో వివో స్వచ్చంధంగా ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ గా తప్పుకుంది.

చైనాకు చెందిన యాప్ లపై ప్రభుత్వం నిషేధం విధించుకుంటూ పోతుంటే.... బీసీసీఐ మాత్రం వివోనే కొనసాగించడానికి నిశ్చయించుకుంది. ఈ నేపథ్యంలోనే తీవ్ర దుమారం చెలరేగడం, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇది మరింతగా ఎక్కువవడంతో వివో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలియవస్తుంది.

ఇటీవల భారత ప్రభుత్వం చైనా దేశానికి సంబంధించి 59 యాప్లను నిషేధించిన సంగతి కూడా విదితమే. ఇలాంటి నేపథ్యంలో ఐపీఎల్‌ స్పాన్సర్ గా వివో సంస్థ స్వచ్ఛందంగా స్పాన్సర్ షిప్ నుండి తప్పుకోవడానికి సిద్ధమైంది.

Follow Us:
Download App:
  • android
  • ios