ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తున్న సమయంలో ప్రారంభమైంది ఐపీఎల్ 2020. రోజూ కరోనా కేసుల లెక్కలు, మరణాల సంఖ్యల వార్తలతో విసిగి వేసారిపోయిన జనాలకు, ఐపీఎల్ మంచి రిలీఫ్‌ని అందించింది.

మొదటి మ్యాచ్ నుంచి ఆఖరి మ్యాచ్ దాకా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులు, గ్రూప్ ఆఖరి మ్యాచ్‌ దాకా ప్లేఆఫ్ బెర్తులు డిసైడ్ కాకపోవడం, సూపర్ ఓవర్ మ్యాచ్‌లు... ఇలా ఐపీఎల్ 2020 సీజన్‌ను సూపర్ డూపర్ హిట్టు చేశాయి. 

టీఆర్పీ రేటింగ్‌లో రికార్డు క్రియేట్ చేసిన ఐపీఎల్ 2020... సోషల్ మీడియాలో కూడా సంచలనం క్రియేట్ చేసింది. గూగుల్ ఇండియా లెక్కల ప్రకారం అత్యధికంగా సెర్చ్ చేసిన ఈవెంట్‌గా ఐపీఎల్ 2020 నిలిచింది.

ప్రపంచదేశాలను వణికించిన కరోనా వైరస్, అమెరికా ఎన్నికలు... ఇలా జనాల దృష్టిని ఆకర్షించిన విషయాలన్నీంటినీ వెనక్కినెట్టి ఐపీఎల్ 2020 టాప్‌లో నిలిచింది. ట్విట్టర్‌లో కూడా అత్యధికంగా చర్చించుకున్న టాపిక్ కూడా ఐపీఎల్ 2020.