జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్థాన్ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. సన్ రైజర్స్ హైదరాాబాద్ తో తలపడ్డ  రాజస్థాన్ సొంత మైదానంలో నిజంగానే రాయల్స్ అని నిరూపించుకుంది. మొదట రాజస్థాన్ బౌలింగ్ లో రాణించి భారీ స్కోరు సాధిస్తుందనుకున్న సన్ రైజర్స్ ను 160 పరుగులకే పరిమితం చేసింది. ఆ తర్వాత అలవోకగా మరో 5 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించి వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. 

160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్స్ బ్యాట్ మెన్స్ సమిష్టిగా రాణించారు. ఓపెనర్లు అజింక్య రహానే 34 బంతుల్లో 39 పరుగులు, లివింగ్ స్టోన్ 26 బంతుల్లో 44 పరుగులు, కెప్టెన్ స్మిత్ 16 బంతుల్లో 22 పరుగులు చేశారు. ఇక సంజు శాంసన్ 32 బంతుల్లో 48 పరుగులతో చివరి వరకు నాటౌట్ గా నిలిచి రాజస్థాన్ ను విజయతీరాలకు చేర్చాడు.ఇలా ప్లేఆఫ్ కోసం గట్టి పోటీ నెలకొన్న కీలక సమయంలో రాయల్స్ మంచి విజయాన్ని అందుకుంది. సన్ రైజర్స్ బౌలర్లలో షకిబల్ హసన్ , రషీద్ ఖాన్, ఖలీల్ అహ్మద్ లు తరో వికెట్ పడగొట్టారు.

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు మిశ్రమంగా వ్యవహరించారు. ఆరంభంలో డేవిడ్ వార్నర్, మనీశ్ పాండ్,  దాటిగా ఆడటంతో భారీ స్కోరు వైపు హైదరాబాద్ ఇన్నింగ్స్ సాగింది. అయితే ఒక్కసారి వారిద్దరు ఔటవగానే మిగతా బ్యాట్ మెన్స్ టపటపా ఔటయ్యారు. ఇలా ఆరంభంలో 10 రన్ రేట్ తో బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ భారీ స్కోరు సాధిస్తుందని అభిమానులు ఊహించగా చివరకు 160 పరుగులకు పరిమితమవ్వాల్సి వచ్చింది. 

డేవిడ్ వార్నర్ 37, మనీశ్ పాండే 61, విలియమ్సన్ 13, రషీద్ ఖాన్ 17 తప్ప మిగతావారెవ్వరు రెండంకెల వ్యక్తిగత స్కోరును కూడా సాధించలేకపోయారు. రాయల్స్ బౌలర్లలో వరుణ్ ఆరోన్, థామస్, గోపాల్, ఉనత్కద్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. 

 మంచి ఊపుమీదున్న సమయంలో మనీశ్ పాండే విచిత్రంగా స్టంపౌటయ్యాడు. శ్రేయాస్ గోపాల్ బౌలింగ్ లో క్రీజులో వుండే డిపెన్స్ ఆడటానికి ప్రయత్నించగా బంతి బ్యాట్ కు తాకకుండానే కీపర్ చేతిలోకి వెళ్లింది. అయితే అదే సమయంలో అతడు కాస్త నియంత్రణ కోల్పోయి కాలిని గాల్లోకి లేపడంతో రాయల్స్ కీపర్ శాంసన్ వికెట్లను గిరాటేశాడు. దీంతో 36 బంతుల్లో 61 పరుగులు చేసిన పాండే వెనుదిరగాల్సి వచ్చింది. పాండే ఔటైన తర్వాత సన్ రైజర్స్ వరుసగా వికెట్లు కోొల్పోయింది. కేవలం రెండు పరుగుల తేాడాతోనే ఆల్ రౌండర్ విజయ్ శంకర్, దీపక్ హుడాలు ఔటయ్యారు. విజయ్ శంకర్ ని వరుణ్ ఆరోన్ ఔట్ చేయగా హుడా ను ఉనద్కత్ పెవిలియన్ కు సాగనంపాడు. 

 సన్ రైజర్స్ ఓపెనర్ బెయిర్ స్టో ఐపిఎల్ నుండి నిష్క్రమించడంతో అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన కెప్టెన్ విలియమ్సన్ హైదరాబాద్ అభిమానులను నిరాశపర్చాడు. కేవలం 14 పరుగులు మాత్రమే చేసిన అతడు గోపాల్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఇలా సన్ రైజర్స్ జట్టుకు ఆదిలోని గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఆ తర్వాత బౌలర్ థామస్ సన్ రైజర్స్ జట్టుకు మరో పెద్ద ఝలక్ ఇచ్చాడు. మరో ోపెనర్ డేవిడ్ వార్నర్ ని ఓ అద్భుతమైన మంతితో బోల్తా కొట్టించి ఔట్ చేశాడు.32 బంతుల్లో 37 పరుగులు చేసిన వార్నర్ రాయల్స్ కెప్టెన్ స్మిత్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.  

జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో మరో రసవత్తర పోరు జరిగింది.  ప్లేఆఫ్ బెర్తు కోసం పోటీ పడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో గెలిచి ప్లేఆఫ్ ఆశలను మరింత మెరుగుపర్చకోవాలని ఇరుజట్లు భావిస్తూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుండటంతో అభిమానుల్లో ఈ మ్యాచ్ పై మరింత ఆసక్తి పెరిగింది.  అయితే చివరకు ఆతిథ్య రాజస్థాన్ దే ఈ మ్యాచ్ లో పైచేయిగా నిలిచింది.  

రాజస్ధాన్ జట్టులో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. బెన్ స్టోక్స్, జోప్రా ఆర్చర్ స్థానంలో టర్నర్, లివింగ్ స్టోన్ జట్టులోకి వచ్చారు. అలాగే హైదరాబాద్ జట్టులోకి కేన్  విలియమ్సన్, వృద్దిమాన్ సాహాలు చేరారు. 
 
సన్ రైజర్స్ జట్టు: 

డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), మనీశ్ పాండే, విజయ్ శంకర్, షకిబల్ హసన్, దీపక్ హుడా, వృద్దిమాన్ సాహా(వికెట్ కీపర్), రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, సిద్దార్థ్ కౌల్

రాయల్స్ జట్టు:

అజింక్య రహానే, సంజు శాంసన్ (వికెట్ కీపర్), స్టీవ్ స్మిత్ (కెప్టెన్), లియామ్ లివింగ్ స్టోన్, రియాన్ పరాగ్, ఆస్టోన్ టర్నర్, స్టువర్ట్ బిన్ని, శ్రేయాస్ గోపాల్, జయదేవ్ ఉనద్కత్, వరుణ్ ఆరోన్, థామస్