Asianet News TeluguAsianet News Telugu

ఉత్కంఠ పోరులో ఆర్సిబిదే విజయం... హైదరాబాద్ ప్లేఆఫ్ అవకాశాలు మరింత సంక్లిష్టం

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం మరో ఉత్కంఠ పోరుకు వేదికయ్యింది. ఇక్కడ లోకల్ టీం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది.అయితే చివరకు ఆర్సిబినే విజయం వరించింది.

ipl 2019: royal challengers bangalore vs sun risers hyderabad match updates
Author
Bangalore, First Published May 4, 2019, 7:57 PM IST

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం మరో ఉత్కంఠ పోరుకు వేదికయ్యింది. ఇక్కడ లోకల్ టీం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. సన్ రైజర్స్ నిర్దేశించిన 176 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆర్సిబి బ్యాటింగ్ ఎన్నో మలుపులు తిరిగింది. మెదట ఓపెనర్లు పార్థివ్, కోహ్లీ, డెవిలియర్స్ తక్కువ పరుగులకే ఔటవడంతో మ్యాచ్ ఎస్‌ఆర్‌హెచ్ వైపు మళ్లింది. అయితే ఆ తర్వాత హెట్మెయర్ (6 సిక్సులు. 4 ఫోర్ల సాయంతో 47 బంతుల్లోనే 75 పరుగులు), గురుకీరత్ (48 బంతుల్లో 65 పరుగులు) జోడి అద్భుతంగా ఆడటంతో మధ్యలో మ్యాచ్ ఆర్సిబి వైపు మళ్ళింది. 

ఇక చివరి ఓవర్లలో మ్యాచ్ మరింత ఉత్కంఠకు దారితీసింది. క్రీజులో కుదురుకున్న హెట్మెయర్, గురుకీరత్ నాలుగు బంతుల తేడాలోనే ఔటయ్యారు. ఆ తర్వాత వచ్చిన వాషింగ్ టన్ సుందర్ కూడా డకౌటయ్యాడు. అయితే చివరి ఓవర్లో 6 పరుగులు అవసరమున్న సమయంలో నబి బౌలింగ్ లో వరుసగా రెండు ఫోర్లు బాదిన ఉమేశ్ యాదవ్ మరో నాలుగు బంతులు మిగిలుండగానే ఆర్సిబికి విజయాన్ని అందించాడు. 

మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ బ్యాట్ మెన్స్ లో కేన్ విలియమ్సన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.బ్యాటింగ్ కు దిగినప్పటి నుండి ఆచితూచి ఆడుతూ మధ్యమధ్యలో బౌండరీలతో ఆకట్టుకున్నాడు. అయితే ఉమేశ్ యాదవ్ వేసిన చివరి ఓవర్లో తన విశ్వరూపం చూపించాడు. వరుసగా 6,4,6,4 తో నాలుగు బంతుల్లోనే 20 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత రెండు బంతుల్లో మరో ఏడు పరుగులు రావడంతో మొత్తం 27 పరుగులు పిండుకున్నారు. దీంతో సన్ రైజర్స్ 175 పరుగుులు సాధించగలిగింది. 

సన్ రైజర్స్ బ్యాట్ మెన్ విజయ్ శంకర్ వరుసగా రెండు సిక్సర్లు బాది హ్యాట్రిక్ కోసం ప్రయత్నించి ఔటయ్యాడు.  వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో దాటిగా ఆడుతూ వరుస బంతుల్లో రెండు సిక్సర్లు బాదిన శంకర్ మూడో బంతిని కూడా బౌండరీకి తరలించడానికి ప్రయత్నించాడు. అయితేే బంతి బ్యాట్ అంచులకు తాకి అక్కడే గాల్లోకి లేవగా గ్రాండ్ హోమ్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో శంకర్ ఇన్నింగ్స్ కు తెరపడింది. 

కీలకమైన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత కొద్దిరోజులుగా జరిగిన మ్యాచుల్లో పరుగులు సాధిస్తూ ఫామ్ లోకి వచ్చిన మనీష్ పాండే ఈ మ్యాచ్ లో ఆకట్టుకోలేకపోయాడు. కేవలం 9 పరుగులు మాత్రమే చేసి సుందర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. వేగంగా పరుగులు సాధించే క్రమంలో సన్ రైజర్స్ ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ కూడా ఔటయ్యాడు. 2 సిక్సులు, రెండు ఫోర్ల సాయంతో 23 బంతుల్లోనే 30 పరుగులు చేసిన అతడు వాషింగ్టన్ సుందన్ బౌలింగ్ లో మరో భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. 

దాటిగా బ్యాటింగ్ మొదలుపెట్టిన సన్ రైజర్స్ ఆదిలోనే ఓపెనర్ సాహా వికెట్ కోల్పోయింది. సాహా నాలుగు ఫోర్ల సాయంతో 11 బంతుల్లోనేమ 20 పరుగులు చేసి సైనీ బౌలింగ్ లో ఔటయ్యాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో కీలక మ్యాచ్ కోసం సిద్దమయ్యింది. ప్లేఆఫ్ కు చేరాలంటే తప్పకుండా గెలవాల్సిన చివరి మ్యాచ్ ను మరికొద్దిసేపట్లో బెంగళూరులో ఆడనుంది. ఇప్పటికే నాకౌట్ ఆశలు గల్లంతవడంతో హోంగ్రౌండ్ లో చివరి మ్యాచ్ గెలిచి పరువు నిలబెట్టుకోవాలని బెంగళూరు రాయల్ చాలెంజర్స్ భావిస్తోంది. ఇలా ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న ఈ మ్యాచ్ పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సిబి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్  మొదట బ్యాటింగ్ చేయనుంది. సన్ రైజర్స్ జట్టు అభిషేక్ ను పక్కనబెట్టి యూసుఫ్ పఠాన్ కు ఈ  మ్యాచ్ లో ఆడే అవకాశాన్నిచ్చింది. 

ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ...ఈ మ్యాచ్ కేవలం ప్యాన్స్ కోసమే ఆడతామన్నారు. వాళ్లను మా ప్రదర్శనతో అలరించడానికి ప్రయత్నిస్తామన్నాడు. గత మ్యాచ్ ఆడిన పవన్ నేగి, క్లాసెస్ స్థానంలో హెట్మెయర్, సుందర్ జట్టులోకి వచ్చినట్లు కోహ్లీ తెలిపాడు. 

సన్ రైజర్స్ టీం:

మార్టిన్ గప్తిల్, వృద్దిమాన్ సాహా, మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, యూసుఫ్ పఠాన్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, తంపి, ఖలీల్ అహ్మద్ 
 
ఆర్సిబి టీం: 

పార్థీవ్ పటేల్, విరాట్ కోహ్లీ, డివిలియర్స్, హెట్మెయర్, గురుకీరత్ సింగ్, సుందర్, గ్రాండ్ హోమ్, ఉమేశ్ యాదవ్, నవదీప్ సైనీ, చాహల్, కుల్వంత్ 

Follow Us:
Download App:
  • android
  • ios