ముంబై: ఐపిఎల్ 2019లో భాగంగా ఆదివారం జరిగిన మూడో లీగ్ మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ పై 37 పరుగుల తేడాతో ఓడిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేయగా, ముంబై ఇండియన్స్ 19.2 ఓవర్లలో 176 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ, రబడ రెండేసి వికెట్లు తీసుకోగా, బౌల్ట్, తివాటియా, అక్షర పటేల్, పాల్ తలో వికెట్ తీసుకున్నారు. 176 పరుగుల వద్ద మెక్ క్లింగాన్ ఔట్ కావడంతో ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ముగిసింది. గాయం కారణంగా బుమ్రా బ్యాటింగ్ చేయలేకపోయాడు. దీంతో 9 వికెట్లను కోల్పోయి 176 పరుగులు చేసిన ముంబై ఓటమిని అంగీకరించింది.

ఢిల్లీపై మ్యాచులో ముంబై ఇండియన్స్ 170 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. యువరాజ్ సింగ్ 53 పరుగుులు చేసి అవుటయ్యాడు. దాంతో ముంబై ఇండియన్స్ ఓటమి దాదాపుగా ఖరారైంది.134 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. కృణాల్ పాండ్యా 15 బంతుల్లో ఐదు ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 32 పరుగులు చేసి బౌల్ట్ బౌలింగులో తివాటియాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 153 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. కటింగ్స్ 3 పరుగులు చేసి రబడ బౌలింగులో అవుటయ్యాడు. అప్పటికి ముంబై ఇండియన్స్ 21 బంతుల్లో 61 పరుగులు చేయాల్సి ఉంది. యువరాజ్ సింగ్ 33 బంతుల్లో 52 పరుగులతో అర్థ సెంచరీ సాధించాడు.

ముంబై 95 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. పోలార్డ్ భారీ షాట్ కు ప్రయత్నించి పాల్ బౌలింగులో తివాటియాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అదే స్కోరు వద్ద ముంబై ఇండియన్స్ ఐదో వికెట్ కోల్పోయింది. హార్జిక్ పాండ్యా అక్షర పటేల్ బౌలింగులో కాట్ అండ్ బౌల్డ్ గా సున్నా పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు.ముంబై ఇండియన్స్ 45 పరుగుల స్కోరు వద్ద మూడో వికెట్ కోల్పోయింది.ఢీకాక్ 16 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 27 పరుగులు చేసి ఇషాంత్ శర్మ బౌలింగులో అవుటయ్యాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ తమ ముందు ఉంచిన 214 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ 37 పరుగుల స్కోరు వద్ద రెండో వికెట్ కోల్పోయింది. సూర్యకుమార్ 2 పరుగులు చేసి రన్నవుట్ అయ్యాడు. ముంబై ఇండియన్స్ 33 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ ధాటిగా  ఆడే ప్రయత్నంలో 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు.ఇషాంత్ శర్మ బౌలింగులో తివాటియాకు క్యాచ్ ఇచ్చి అతను అవుటయ్యాడు.

ఐపిఎల్ లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ బౌలర్లకు ఢల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ చుక్కలు చూపించాడు. రిషబ్ పంత్ కేవలం 27 బంతుల్లో ఏడు సిక్స్ లు, ఏడు ఫోర్ల సాయంతో 78 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రాహుల్ తివాటియా 9 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ బౌలర్లలో మెక్ క్లింగాన్ 3 వికెట్లు తీసుకున్నాడు. బుమ్రా, హార్దిక్ పాండ్యా, కటింగ్స్ లకు తలో వికెట్ తీసుకున్నారు. 

ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ పై 165 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. అక్సర్ పటేల్ 4 పరుగులు చేసి బుమ్రా బౌలింగులో అవుటయ్యాడు. అంతకు ముందు 157 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. వాంఖడే స్టేడియంలో జరిగిన ఐపిఎల్ మూడో లీగ్ మ్యాచులో ముంబై ఇండియన్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ 131 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. శిఖర్ ధావన్ 36 బంతుల్లో 43 పరుగులు చేసి హార్డిక్ పాండ్యా బౌలింగులో అవుటయ్యాడు. 

ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. మిచెల్ వేసిన రెండో ఓవర్ మూడో బంతికి పృథ్వీ షా(7) కీపర్ డీ కాక్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో రెండు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 1 వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది.

కెప్టెన్ శ్రీయాస్ అయ్యర్ 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మెక్ క్లింగాన్ బౌలింగులో అవుటయ్యాడు. దీంతో ఢిల్లీ 29 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఇంగ్రామ్ ధాటిగా ఆడాడు. 32 బంతుల్లో 47 పరుగులు చేసి కట్టింగ్ బౌలింగులో అవుటయ్యాడు.

జట్ల వివరాలు:

ఢిల్లీ క్యాపిటల్స్: శిఖర్ ధావన్, పృధ్వీ షా, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రిషబ్ పంత్(కీపర్), కోలిన్ ఇన్‌గ్రామ్, కీమో పాల్, అక్సర్ పటేల్, రాహుల్ తెవాటియా, కగిసో రబడా, ట్రెంట్ బోల్ట్, ఇశాంత్ శర్మ.

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), క్వింటన్ డి కాక్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్యా, యువరాజ్ సింగ్, కీరన్ పొలార్డ్, హార్థిక్ పాండ్యా, బెన్ కట్టింగ్, మిచెల్ మెక్‌క్లీన్‌గాన్, రాసిక్ సలామ్, జస్ప్రీత్ బుమ్రా.