Asianet News TeluguAsianet News Telugu

డెత్ ఓవర్లలో ఆదుకున్న ఆర్చర్...ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే విజయం

కోల్‌కతా వేదికగా జరిగన మ్యాచ్ లో రాజస్థాన్ అద్భుతవిజయం సాధించింది. రాయల్స్ అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ విభాగాల్లో రాణించి కోల్ కతా నైట్ రైడర్స్ ను మట్టికరిపించారు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టులో ఏ ఒక్కరు కనీసం హాఫ్ సెంచరీ చేయకున్నా అందరూ తలో కొన్ని పరుగులు చేయడంతో మరో నాలుగు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేదించింది.

ipl 2019: kolkata knight riders vs rajasthan royal match updates
Author
Kolkata, First Published Apr 25, 2019, 8:07 PM IST

కోల్‌కతా వేదికగా జరిగన మ్యాచ్ లో రాజస్థాన్ అద్భుతవిజయం సాధించింది. రాయల్స్ అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ విభాగాల్లో రాణించి కోల్ కతా నైట్ రైడర్స్ ను మట్టికరిపించారు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టులో ఏ ఒక్కరు కనీసం హాఫ్ సెంచరీ చేయకున్నా అందరూ తలో కొన్ని పరుగులు చేయడంతో మరో నాలుగు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేదించింది.

రాజస్థాన్ బ్యాట్ మెన్స్ లో ముఖ్యంగా ఓపెనర్లు రహానే 34, శాంసన్ 22 పరుగులు చేయగా మిడిల్ ఆర్డర్ లో పరాగ్ 47 పరుగులతో రాణించాడు. అయితే చివర్లో సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోతున్న సమయంలో ఆర్చర్ 2 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 12 బంతుల్లోను 27 పరుగులు చేసి రాజస్థాన్ ను విజయతీరాలకు చేర్చాడు.

కెకెఆర్ బౌలర్లలో చావ్లా అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లను పడగొట్టడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేశాడు. అలాగే సునీల్ నరైన్ 2, రస్సెల్, క్రిష్ణ ఒక్కో వికెట్ పడగొట్టారు. అయితే ప్రసిద్ క్రిష్ణ కేవలం 3.2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి ఏకంగా 43 పరుగులు సమర్పించుకున్నాడు. 

తన సూపర్ బ్యాటింగ్ తో రాజస్థాన్ ను దాదాపు విజయతీరానికి తీసుకువచ్చి సమయంలో రియాన్ పరాగ్ ఔటయ్యాడు. 2 సిక్సర్లు 5 ఫోర్ల సాయంతో 31 బంతుల్లోను 47 పరుగులు చేసిప పరాగ్ చివరకు అర్థశతకాన్ని పూర్తిచేసుకోకుండానే ఔటయ్యాడు. అంతకు ముందు దాటిగా బ్యాటింగ్ చేస్తూ స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో గోపాల్ ఔటయ్యాడు.అతడు 9 బంతుల్లోనే 18 పరుగులు చేసి ప్రసీద్ క్రిష్ణ బౌలింగ్ లో ఔటయ్యాడు. 

176 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు శుభారంబాన్ని అందించారు. అయితే వారి నిష్క్రమణ తర్వాత వెంటవెంటనే రెండు వికెట్లు పడటంతో కేవలం 78 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు రహానే 34 పరుగులు, శాంసన్ 22 పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత కెప్టెన్ స్మిత్ కేవలం 2 పరుగులకే పెవిలియన్ బాట పట్టగా...మొదటినుండి ఎన్న ఆశలు పెట్టుకున్న బెన్ స్టోక్స్ కూడా 11 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.  

కోల్ కతా నైట్ రైడర్స్ సారథి దినేశ్ కార్తిక్ ఇవాళ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాట్ మెన్స్ అందరూ విఫలమైన సమయంలో బ్యాటింగ్ బాద్యతను భుజాల పై వేసుకుని 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇలా సెంచరీ మిస్సయినప్పటికి తన ఐపిఎల్ కెరీర్లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసుకున్నాడు. 9మ సిక్సర్లు 7 ఫోర్ల సాయంతో కేవలం 50 బంతుల్లోనే ఈ పరుగులు చేశాడు. దీంతో మిగతా బ్యాట్ మెన్స్ ఎవరూ రాణించకపోయినా కెకెఆర్ 176 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ ముందు ఉంచగలిగింది.  

మరోసాారి తన భారీ షాట్లతో ఆకట్టుకుంటాడనుకున్న రస్సెల్స్ నిరాశ పరిచాడు. కేవలం 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌండరీ కోసం ప్రయత్నించి ఔటయ్యాడు. ఇతడి వికెట్ ను థామస్ పడగొట్టాడు. అంతకుముందు పరుగుల వేగం పెరిగిన సమయంలో మరో వికెట్ కోల్పోయింది. అనవసర పరుగుకు ప్రయత్నించి నరైన్ రనౌటయ్యాడు. ఇలా రనౌట్ చేసింది కూడా వరుణ్ ఆరోనే. ఇలా ఇప్పటివరకు రాజస్థాన్ తీసిన నాలుగు వికెట్లలోనూ వరుణ్ భాగస్వామ్యముంది. 

కోల్ కతా వికెట్ల పతనం ఆగడం లేదు. వేగంగా ఆడే ప్రయత్నం చేస్తూ నితీశ్ రానా కూడా తన వికెట్ ను సమర్పించచుకున్నాడు. ఈసారి వికెట్ తీసే బాధ్యతను గోపాల్ తీసుకున్నాడు. కానీ ఇందులోనూ వరుణ్ భాగస్వామి అయ్యాడు. రానా గాల్లోకి లేపిన బంతి నేరుగా వరుణ్ చేతిలో వచ్చి పడింది. ఇలా కేవలం 42 పరుగులకే కోల్ కతా మూడు వికెట్లు కోల్పోయింది. 

రాజస్ధాన్ బౌలర్ వరున్ ఆరోన్ కోల్ కతా బౌలర్లను బెదరగొడుతున్నాడు. ఖాతా తెరవకుండానే ఓ ఓపెనర్ వికెట్ పెవిలియన్ కు పంపించిన అతడే మరో ఓపెనర్ వికెట్ ను కూడా పడగొట్టాడు. గిల్ ను (14 పరుగుల) ఓ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ కు పంపించాడు. దీంతో రెండు వికెట్లు వరున్ ఖాతాలోనే చేరాయి. 

సొంత మైదానంలో బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా జట్టుకు ఆదిలోని గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పరుగుల ఖాతా తెరవకుండా ఓపెనర్ లిన్ వికెట్ ను కోల్పోయింది. రాజస్థాన్ బౌలర్ వరుణ్ ఆరోన్ ఓ చక్కని బంతితో లిన్ ను బోల్తా కొట్టించాడు.  

ఐపిఎల్ ఆరంభంలో వరుస విజయాలతో దూసుకుపోయిన కోల్ కతా చివరి ఐదు మ్యాచుల్లో ఓటమిని చవిచూసింది. దీంతో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచులకు గాను కేవలం 4 మాత్రమే గెలిచి 8 పాయింట్లను సాధించింది.  ఇలా వరుస ఓటములతో కేకేఆర్ పాయింట్స్  టేబుల్ లో చివరి నుండి మూడో స్థానానికి చేరుకుంది. దీంతో ఈ మ్యాచ్ ని గెలిచి  మళ్లీ గెలుపు బాటలోకి రావాలని కోల్ కతా చూస్తోంది. 

ఇరు జట్లలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. రాజస్థాన్ జట్టులోకి థామస్, వరుణ్ ఆరోన్ కొత్తగా చేరారు. అలాగే కేకేఆర్ జట్టులోకి బ్రాత్ వైట్, ప్రసీద్ క్రిష్ణ చేరారు.

కేకేఆర్ జట్టు: 
 
కార్లోస్ లిన్, సునీల్ నరైన్, శుభ్ మన్ గిల్, నితీశ్ రానా, దినేశ్ కార్తిక్ (కెప్టెన్, కీపర్) రింకు సింగ్, రస్సెల్, బ్రాత్ వైట్, ప్రసీద్ క్రిష్ణ, చావ్లా, పృథ్విరాజ్ 


రాయల్స్ జట్టు;

అజింక్య రహానే, సంజు శాంసన్, స్టీవ్ స్మిత్,, బెన్ స్టోక్, రియాన్ పరాగ్, స్టువర్ట్ బిన్ని, జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, జయదేవ్ ఉనద్కత్, థామస్, వరుణ్ ఆరోన్ 

  

Follow Us:
Download App:
  • android
  • ios