చెన్నై: ఐపిఎల్ 2019 తొలి మ్యాచులో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ను ధోోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. కోహ్లీ సైనపై చెన్నై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ను చెన్నై బౌలర్లు 70 పరుగులకు కట్టడి చేశారు చెన్నై సిన్నర్లు ఇమ్రాన్ తాహిర్, హర్భజన్ సింగ్ బెంగళూర్ బ్యాటింగ్ వెన్ను విరిచారు. చెన్నై 17.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. బెంగళూర్ కేవలం 70 పరుగులకే చేతులెత్తేసింది.బెంగళూర్ బౌలర్లలో మొయిన్ అలీ, చాహల్, సిరాజ్ తలో వికెట్ తీసుకున్నారు. కేదార్ జాదవ్ 13 పరుగులతో, జడేజా 6 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ పై జరిగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ 59 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. అంబటి రాయుడు 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మొహమ్మద్ సిరాజ్ బౌలింగులో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చెన్నై 40 పరుగుల స్కోరు వద్ద రెండో వికెట్ కోల్పోయింది. సురేష్ రైనా 19 పరుగులు చేసి మొయిన్ అలీ బౌలింగులో దూబేకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ తమ ముందు ఉంచిన 71 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. పది బంతులు ఆడి పరుగులేమీ చేయకుండా షేన్ వాట్సన్ చాహల్ బౌలింగులో పెవిలియన్ చేరుకున్నాడు.8 పరుగుల స్కోరు వద్ద చెన్నై తొలి వికెట్ కోల్పోయింది.ఆ తర్వాత అలీ బౌలింగులో అవుటయ్యే ప్రమాదం నుంచి అంబటి రాయుడు తప్పించుకున్నాడు. ఉమేష్ యాదవ్ క్యాచ్ డ్రాప్ చేశాడు. దీంతో రాయుడు బతికి పోయాడు.

చెన్నై సూపర్ కింగ్స్ పై శనివారం జరిగిన మ్యాచులో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ బ్యాట్స్ మెన్ క్యూ కట్టారు. 70 పరుగులకే బెంగళూర్ బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. వరుసగా తన సహ ఆటగాళ్లు పెవిలియన్ కు క్యూ కడుతుంటే ప్రేక్షకుడిలా నిలుచుండి పోయిన ఓపెనర్ పార్థివ్ పటేల్ చివరి వికెట్ గా వెనుదిరిగాడు. 29 పరుగుల వద్ద పార్థివ్ పటేల్ బ్రేవో బౌలింగులో అవుటయ్యాడు.

రాయల్ చాలెంజర్స్ బెంగుళూర్ బ్యాట్స్ మెన్ పూర్తి 20 ఓవర్లు కూడా ఆడలేకపోయారు. 17.1 ఓవర్లలోనే ఆలవుట్ అయ్యారు. చెన్నై బౌలర్లలో హర్భజన్, ఇమ్రాన్ తాహిర్ తలో మూడు వికెట్లు తీయగా, జడేజా రెండు వికెట్లు పడగొట్టాడు. చివరి వికెట్ బ్రేవోకు లభించింది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ 70 పరుగుల స్కోరు వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. చివరి వికెట్ కూడా అదే స్కోరు వద్ద కోల్పోయింది. 10 బంతుల్లో 1 పరుగు చేసిన ఉమేష్ యాదవ్ జడేజా బౌలింగులో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.59 పరుగుల స్కోరు వద్ద 8వ వికెట్ కోల్పోయింది. ఇమ్రాన్ తాహిర్ బౌలింగులో భజ్జీకి క్యాచ్ ఇచ్చి చాహల్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు.

చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచులో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ 53 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. నవదీప్ సైనా 2 పరుగులు చేసి ఇమ్రాన్ తాహిర్ బౌలింగులో అవుటయ్యాడు.రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ 50 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. గ్రాండ్ హోమ్ 4 పరుగులు మాత్రమే చేసి రవీంద్ర జడేజా బౌలింగులో ధోనీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ 45 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. డి విల్లీర్స్ 9 పరుగులకు హర్బజన్ బౌలింగులో అవుట్ కాగా, హెట్మియర్ సున్నా పరుగులకు రన్నవుట్ అయ్యాడు. దూబే 2 పరుగులు మాత్రమే చేసి ఇమ్రాన్ తాహిర్ బౌలింగులో అవుటయ్యాడు. అంతకు ముందు 28 పరుగుల స్కోరు వద్ద రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ రెండో వికెట్ కోల్పోయింది.మొయిన్ అలీ 9 పరుగులు మాత్రమే చేసి హర్భజన్ బౌలింగ్ లో కాట్ అండ్ బౌల్డ్ గా వెనుదిరిగాడు.

ఓపెనర్ గా దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు. హర్బజన్ సింగ్ వేసిన బంతికి బోల్తా కొట్టాడు. కేవలం ఆరు పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2019లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచులో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ (ఆర్ సిబీ), ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్ కె) తలపడింది. కోహ్లీ సేనపై టాస్ గెలిచి ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పార్థివ్ పటేల్ తో కలిసి ఓపెనర్ గా బ్యాటింగ్ కు దిగాడు.

తుది జట్లు

రాయల్ చాలెంజర్స్ బెంగళూర్

పార్థివ్ పటేల్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ (కెప్టెన్), మొయిన్ అలీ, ఎబి డీవిలీర్స్, శిమ్రాన్ హెట్మియర్, శివం దూబే, కోలిన్ డీ గ్రాండోమ్, ఉమేష్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, మొహమ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ

చెన్నై సూపర్ కింగ్స్

అంబటి రాయుడు, షేన్ వాట్సన్, సురేష్ రైనా, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్, కెప్టెన్), కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, డ్వైనే బ్రేవో, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్