IPL 2024: మార్చి 22న ఐపీఎల్-2024 ప్రారంభం.. తొలి మ్యాచ్ ఆ జట్ల మధ్యే.. !
IPL 2024: మెగా క్రికెట్ లీగ్ కు సర్వం సిద్ధమవుతోంది. అన్ని పుకార్లకు ఫుల్ స్టాప్ పెడుతూ ఈ సారి కూడా భారత్ లోనే ఐపీఎల్ 17వ ఎడిషన్ ను నిర్వహిస్తామని ఐపీఎల్ వర్గాలు స్పష్టం చేశాయి.
IPL 2024: కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ ఎడిషన్ ఎప్పటి నుంచి మొదలవుతుందనే ప్రశ్నకు ఎట్టకేలకు సమాధానం దొరికింది. మార్చి 22న మెగా టోర్నీ ప్రారంభం కానుందని ఐపీఎల్ చీఫ్ అరుణ్ ధుమాల్ స్వయంగా వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికలు జరిగినా టోర్నీని వేరే దేశానికి మార్చబోమని స్పష్టం చేశారు. ఐపీఎల్ 17వ సీజన్ ను కూడా భారత్ లోనే నిర్వస్తామని చెప్పారు.
ఐపీఎల్ టోర్నీ గురించి విభిన్నమైన ప్రకటనలు ఇటీవల వచ్చాయి. ముఖ్యంగా ఐపీఎల్ ను ఈ సారి విదేశాల్లో నిర్వహిస్తారనే టాక్ కూడా నడించింది. దీనికి ప్రధాన కారణం రాబోయే లోక్ సభ ఎన్నికలు. ఈ క్రమంలోనే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో షెడ్యూల్ విషయంలో గందరగోళంలో క్రమంలో బీసీసీఐ కానీ, ఐపీఎల్ పాలకమండలి కానీ టోర్నీకి సంబంధించిన సమాచారం ఇంకా ఇవ్వలేదు. అయితే, మంగళవారం మీడియాతో అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ.. "లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పటికీ భారత్‌లోనే టోర్నీ నిర్వహిస్తాం. మార్చి 22న టోర్నీని ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నాం. ఎన్నికల కారణంగా టోర్నీ షెడ్యూల్‌పై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని" తెలిపారు.
విరాట్ కోహ్లీ కొడుకు పేరు 'అకాయ్' అంటే అర్థమేంటో తెలుసా?
తొలుత టోర్నీ తొలి 15 రోజుల షెడ్యూల్‌ను ప్రకటిస్తామనీ, ఎన్నికల తేదీ ప్రకటించిన తర్వాత మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఖరారు చేస్తామని అరుణ్ ధుమాల్ పేర్కొన్నారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నందున, వీలైనంత త్వరగా ఐపీఎల్‌ను ముగించడం బీసీసీఐకి అత్యవసరం. అందుకే మే 26న ఐపీఎల్ ఫైనల్ నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల కారణంగా ఐపీఎల్‌ను వేరే దేశంలో నిర్వహించవచ్చనే ఊహాగానాలు మొదట్లో జోరందుకున్నాయి. అయితే ఐపీఎల్ బాస్ దీనిని ఖండించారు. అంతకుముందు 2009లో లోక్‌సభ ఎన్నికల కారణంగా టోర్నీ పూర్తిగా దక్షిణాఫ్రికాకు మారింది. ఆ తర్వాత 2014లో మొదటి కొన్ని మ్యాచ్‌లు యూఏఈలో జరిగాయి, ఆ తర్వాత భారత్‌లో టోర్నీని నిర్వహించారు. 2019లో ఎన్నికలు జరిగినప్పటికీ టోర్నీని భారత్‌లోనే నిర్వహించారు. ఐపీఎల్ 2024 లో తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది.
WPL 2024 లో బాలీవుడ్ జోష్.. ! గ్రాండ్ గా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేడుక.. !