భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆదివారం 38వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా... టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్‌, ఛాంపియన్స్ ట్రోఫీలను అందించడంతో పాటు అన్ని ఫార్మాట్లలోనూ జట్టును నెంబర్‌వన్‌గా నిలిపిని ఏకైక సారథిగా ధోనీ చరిత్ర సృష్టించాడు.

ఈ క్రమంలో అతని రికార్డులు ఒకసారి గమనిస్తే.. 

* 2016లో మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి.. బలమైన ఆస్ట్రేలియా జట్టును ఆసీస్ గడ్డపైనే వైట్ వాష్ చేసిన ఏకైక్ కెప్టెన్

* క్రికెట్ చరిత్రలో వేలంలో అత్యధిక ధరకు అమ్ముడు పోయిన బ్యాట్ ధోనిదే. దానిని సుమారు రూ. 76 లక్షలకు ఆర్‌కే గ్లోబల్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్ దక్కించుకుంది.

* వన్డే ఫార్మాట్‌లో తొమ్మిదిసార్లు సిక్సర్‌తోనే ఫినిషింగ్ టచ్ ఇచ్చిన ఏకైక క్రికెటర్ మహేంద్రుడే

* కెప్టెన్‌గా 150 టీ20 మ్యాచ్‌లలో విజయాన్ని సాధించిన తొలి క్రికెటర్

* టీ20లలో ఐదు వేల పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి సారథి