పొట్టి ప్రపంచకప్‌లో ఆసక్తికర విషయాలు.. చెరిగిపోని రికార్డులు ఇవే..
T20 World Cup 2022: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ ప్రస్తుతం క్వాలిఫై రౌండ్ తో పాటు ప్రాక్టీస్ మ్యాచ్ లు కూడా జరుగుతున్నాయి. మరో మూడు రోజుల్లో ఇవి కూడా ముగుస్తాయి. ఆ తర్వాత సూపర్-12 మొదలవుతుంది.
క్రికెట్ అంటే పడిచచ్చే అభిమానులు ఉన్న దేశాలలో ఆస్ట్రేలియా ఒకటి. ఆ దేశ జాతీయ క్రీడ కూడా క్రికెటే కావడం గమనార్హం. అటువంటిది ఆ దేశంలోనే ప్రపంచకప్ వంటి మెగా టోర్నీ జరిగితే ఆ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. కంగారూల ఆనందాన్ని డబుల్ చేస్తూ రెండ్రోజుల క్రితమే టీ20 ప్రపంచకప్ అట్టహాసంగా మొదలైంది. ప్రస్తుతం అర్హత మ్యాచ్ లు జరుగుతుండగా 21 నుంచి అసలు సమరం మొదలుకానుంది. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఇక్కడ చూద్దాం.
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న పొట్టి ప్రపంచకప్ 8వ ఎడిషన్. ఈ 8 సార్లలో ఒక్కసారి కూడా టోర్నీకి ఆతిథ్యమిచ్చిన దేశం కప్ కొట్టలేదు. మరి ఈ రికార్డును డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగుతున్న ఆస్ట్రేలియన్లు తిరగరాస్తారా..? అనేది త్వరలోనే తేలనుంది.
- ఇప్పటివరకు 8 ఎడిషన్లు జరగగా రెండు సార్లు ప్రపంచకప్ నెగ్గిన ఏకైక జట్టు వెస్టిండీస్.. కరేబియన్లు 2012, 2016లో ఈ మెగా టోర్నీ నెగ్గారు. కానీ తాజా ప్రపంచకప్ లో మాత్రం విండీస్ క్వాలిఫై రౌండ్ లో ఉంది. ఇప్పటికే ఆ జట్టు స్కాట్లాండ్ తో ఓడింది. మరో మ్యాచ్ ఓడితే గోవిందా..
- గతంలో ముగిసిన ఏడు ప్రపంచకప్ లలో పాల్గొన్న ఆటగాళ్లు : రోహిత్ శర్మ, క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో, షకిబ్ అల్ హసన్, మహ్మదుల్లా, ముష్పీకర్ రహీం. వీరిలో 8వ ప్రపంచకప్ ఆడుతున్న ఆటగాళ్లు రోహిత్, షకిబ్ మాత్రమే.
- ఇప్పటివరకు మూడు సార్లు ఫైనల్ చేరిన జట్టు శ్రీలంక.. (2009, 2012, 2014)
- ఫాస్టెస్ట్ ఫిఫ్టీ : యువరాజ్ సింగ్ (12 బంతుల్లోనే.. 2007లో ఇంగ్లాండ్ పై)
- ఫాస్టెస్ట్ హండ్రెడ్ : క్రిస్ గేల్ (2016లో ఇంగ్లాండ్ పై గేల్ 48 బంతుల్లోనే సెంచరీ చేశాడు)
- టీ20 ప్రపంచకప్ లో రెండు సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు గేల్ మాత్రమే.. (2007 లో సౌతాఫ్రికా మీద 57 బంతుల్లో ఒకటి.. ఇంగ్లాండ్ పై 2016లో చేసినదొకటి)
- టీ20 ప్రపంచకప్ టోర్నీలలో ఇప్పటివరకు అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు శ్రీలంకకు చెందిన మహేళ జయవర్దెనే.. (31 మ్యాచ్ లలో 1,016 పరుగులు)
- సింగిల్ ఎడిషన్ లో అత్యధిక పరుగులు : విరాట్ కోహ్లీ (ఆరు మ్యాచ్ లలో 319 పరుగులు - 2014)
- అత్యధిక వికెట్లు : బంగ్లాదేశ్ సారథి షకిబ్ అల్ హసన్ - 31 మ్యాచ్ లలో 41 వికెట్లు
- సింగిల్ ఎడిషన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ : వనిందు హసరంగ (2021లో 18 వికెట్లు)
- ఎంఎస్ ధోని : మోస్ట్ డిస్మిసల్స్ (21 క్యాచ్ లు, 11 స్టంపింగ్స్)
- జట్టుగా అత్యధిక వ్యక్తిగత స్కోరు : 260-6 (శ్రీలంక కెన్యా మీద చేసింది)
- అత్యల్ప స్కోరు: 39 ఆలౌట్ (నమీబియా.. 2014లో శ్రీలంక బౌలింగ్ కు కుదేలైంది)
- ఒక మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు : క్రిస్ గేల్ (11 - ఇంగ్లాండ్ మీద), ఈ టోర్నీలో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు (63) కూడా గేల్ పేరు మీదే ఉంది.
- ఫీల్డర్లలో అత్యధిక క్యాచ్ లు పట్టిన ఆటగాడు : ఏబీ డివిలియర్స్ (23 క్యాచ్ లు)