Asianet News TeluguAsianet News Telugu

గాయం నుంచి కోలుకోని హర్మన్‌ప్రీత్ కౌర్... ఆస్ట్రేలియాతో రెండో వన్డేకి కూడా దూరం...

గాయం కారణంగా మొదటి వన్డేకి దూరమైన హర్మన్‌ప్రీత్ కౌర్... ఇంకా ఫిట్‌నెస్ సాధించని హర్మన్‌ప్రీత్ కౌర్, రెండో వన్డేకి కూడా దూరమైనట్టు బ్యాటింగ్ కోచ్ ప్రకటన...

INDW vs AUSW: Harmanpreet kaur not fit for second odi against Australia
Author
India, First Published Sep 23, 2021, 5:35 PM IST

ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్న భారత మహిళా క్రికెట్ జట్టు, తొలి వన్డేలో 9 వికెట్ల తేడాతో ఓడింది. శుక్రవారం ఇరు జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. ఇప్పటికే గాయం కారణంగా తొలి వన్డేకి దూరమైన భారత వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, రెండో వన్డేలో కూడా పాల్గొనడం లేదు...

‘హర్మన్‌ప్రీత్ కౌర్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. రెండో వన్డేకి కూడా ఆమె అందుబాటులో ఉండదు. మూడో వన్డే సమయానికైనా ఆమె ఫిట్‌నెస్ సాధిస్తుందని ఆశిస్తున్నాం...’ అంటూ కామెంట్ చేశాడు భారత మహిళా జట్టు బ్యాటింగ్ కోచ్ శివ్ సుందర్ దాస్...

‘మిడిల్ ఆర్డర్‌లో భారత జట్టుకి ఎలాంటి సమస్యా లేదు. అయితే టాపార్డర్‌లోనే మొదటి వన్డేలో అవసరమైన పరుగులు రాలేదు. షెఫాలీ వర్మ, స్మృతి మంధాన రెండో వన్డేలో రాణించి... మంచి ఆరంభాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం...’ అంటూ కామెంట్ చేశాడు శివ్ సుందర్ దాస్..

మొదటి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళా జట్టు 8 వికెట్లు కోల్పోయి 225 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన ఫెయిల్ కాగా, కెప్టెన్ మిథాలీరాజ్ హాఫ్ సెంచరీతో ఒంటరిపోరాటం చేసింది.. అయితే కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది ఆస్ట్రేలియా మహిళా జట్టు...
 

Follow Us:
Download App:
  • android
  • ios