రోహిత్ శర్మ రెస్ట్, కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా... విరాట్ కోహ్లీకి కూడా విశ్రాంతి.. తుది జట్టులోకి సంజూ శాంసన్, అక్షర్ పటేల్..
టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన వెస్టిండీస్, బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. నేటి మ్యాచ్‌లో రోహిత్ శర్మ రెస్ట్ తీసుకుంటున్నాడు. దీంతో నేటి మ్యాచ్‌కి హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు.
తొలి వన్డేలో బౌలింగ్ ఎంచుకుని వెస్టిండీస్‌ని 114 పరుగులకి ఆలౌట్ చేసిన టీమిండియా, బ్యాటింగ్ ఆర్డర్‌లో చేసిన ప్రయోగాల వల్ల ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి 5 వికెట్లు కోల్పోయి... తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. శుబ్‌మన్ గిల్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌లో అట్టర్ ఫ్లాప్ అయ్యారు..
ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నా, మ్యాచ్‌ని గెలిపించలేకపోయాడు. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీకి కూడా రెస్ట్ ఇచ్చింది టీమిండియా. వీరి స్థానంలో సంజూ శాంసన్‌తో పాటు అక్షర్ పటేల్‌కి తుది జట్టులో చోటు దక్కింది. భారత వైట్ బాల్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్ నేటి మ్యాచ్‌లో కూడా రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యాడు..
ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ రూపంలో ఇద్దరు వికెట్ కీపర్లు నేటి మ్యాచ్‌లో చోటు దక్కంచుకున్నారు. సంజూ శాంసన్ వన్‌డౌన్‌లో, సూర్యకుమార్ యాదవ్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చే అవకాశం ఉంది. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ రూపంలో ముగ్గురు స్పిన్నర్లు, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్, హార్ధిక్ పాండ్యా రూపంలో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లకు తుది జట్టులో చోటు దక్కింది.
టెస్టు సిరీస్‌తో పాటు తొలి వన్డేలోనూ అట్టర్ ఫ్లాప్ అయిన శుబ్‌మన్ గిల్‌కి నేటి మ్యాచ్ కీలకం కానుంది. శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ ఇద్దరూ కలిసి ఓపెనర్లుగా వన్‌డౌన్‌లో సంజూ శాంసన్, హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ వరకూ భారత బ్యాటింగ్ ఆర్డర్ చాలా పటిష్టంగా కనిపిస్తోంది..
వెస్టిండీస్ జట్టు: బ్రెండన్ కింగ్, కైల్ మేయర్స్, అలిక్ అతనజే, షై హోప్ (కెప్టెన్), సిమ్రాన్ హెట్మయర్, కెసీ కార్టీ, రొమారియో షెఫర్డ్, యాన్నిక్ కరియా, గుడకెశ్ మోటీ, అల్జెరీ జోసఫ్, జేడన్ సీల్స్
భారత జట్టు: శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, హార్ధిక్ పాండ్యా ( కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్
