India vs Sri Lanka 1st Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ... కెప్టెన్‌గా రోహిత్‌కి తొలి టెస్టు, విరాట్ కోహ్లీకి 100వ టెస్టు, శ్రీలంకకి 300వ టెస్టు...
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన భారత జట్టు, బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మకు టెస్టు సారథిగా ఇది తొలి మ్యాచ్ కాగా, భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ కెరీర్‌లో 100వ టెస్టు మ్యాచ్. ఈ మ్యాచ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ... ఓవరాల్‌గా 100+ టెస్టులు ఆడిన 71వ క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు విరాట్ కోహ్లీ... భారత జట్టు తరుపున 100+ ఆడబోతున్న 12వ క్రికెటర్ విరాట్...
ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ (200), రాహుల్ ద్రావిడ్ (163), వీవీఎస్ లక్ష్మణ్ (134), అనిల్ కుంబ్లే (132), కపిల్ దేవ్ (131), సునీల్ గవాస్కర్ (125), దిలీప్ వెంగ్‌సర్కార్ (116), సౌరవ్ గంగూలీ (113), ఇషాంత్ శర్మ (105), హర్భజన్ సింగ్ (103), వీరేంద్ర సెహ్వాగ్ (103) మ్యాచులు ఆడి విరాట్ కోహ్లీ కంటే ముందున్నారు...
అదీకాకుండా వెస్టిండీస్‌పై 70వ అంతర్జాతీయ సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ, సెంచరీ లేకుండా 70 ఇన్నింగ్స్‌లు ఆడేశాడు. లంకపై ఆడబోయే ఇన్నింగ్స్ 71వది...
భారత టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్లు అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా ఇద్దరూ లేకుండా భారత జట్టు టెస్టు మ్యాచ్ ఆడడం గత 9 ఏళ్లలో ఇదే తొలిసారి... 2012లో ఆస్ట్రేలియా టూర్‌లో ఆడిలైడ్ టెస్టులో చివరిసారిగా అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా లేకుండా టెస్టు మ్యాచ్ బరిలో దిగింది భారత జట్టు...
ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ, టెస్టుల్లో తొలి శతకాన్ని అందుకున్నాడు. 213 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 116 పరుగులు చేసి అవుట్ అయ్యాడు విరాట్...
రన్ మెషిన్ నుంచి పరుగుల ప్రవాహం ఆగలేదు, అయితే మూడంకెల స్కోరు మాత్రం విరాట్ కోహ్లీని రెండున్నరేళ్లుగా ఊరిస్తోంది. బుల్లెట్ వేగంతో 70 సెంచరీలు బాదేసిన విరాట్ కోహ్లీని, 71వ శతకం మాత్రం అందని ద్రాక్షలా మారింది... గత రెండేళ్లలో 21 హాఫ్ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, సెంచరీ మార్కుకి దగ్గర దాకా వచ్చి ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి...
మరోవైపు శ్రీలంక క్రికెట్ జట్టుకి ఇది 300వ టెస్టు మ్యాచ్. టీమిండియా టెస్టు సారథిగా రోహిత్ శర్మ ఆరంగ్రేటం చేస్తుండడం, విరాట్ కోహ్లీ 100వ టెస్టు కావడంతో లంకకి స్పెషల్‌గా మారింది...
రోహిత్ శర్మతో పాటు మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ చేస్తుంటే, వన్‌డౌన్‌లో హనుమ విహారి, రహానే స్థానంలో (ఐదో స్థానంలో) శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్‌కి రానున్నారు.
శ్రీలంక జట్టు: దిముత్ కరుణరత్నే, లహిరు తిరుమాన్నే, పథున్ నిశ్శంక, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వ, నిరోసన్ డిక్‌వాలా, సురంగ లక్మల్, విశ్వ ఫెర్నాండో, లసిత్ ఎంబుదెనియా, లహిరు కుమార
భారత జట్టు: రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా
