Asianet News TeluguAsianet News Telugu

INDvsSA 1st ODI: టాస్ గెలిచిన శిఖర్ ధావన్... దీపక్ చాహార్‌కి దక్కని చోటు...

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్... వర్షం కారణంగా 40 ఓవర్ల పాటు సాగనున్న తొలి వన్డే... 

INDvsSA 1st ODI: Shikhar Dhawan won the match and elected to field first
Author
First Published Oct 6, 2022, 3:44 PM IST

లక్నోలో ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మొదటి వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేయనుంది. వర్షం కారణంగా 1:30కి ప్రారంభం కావాల్సిన మ్యాచ్ కాస్తా ఆలస్యంగా 4 గంటలకు ప్రారంభం కానుంది. వరుణుడి అంతరాయం కారణంగా 50 ఓవర్ల వన్డేను 40 ఓవర్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు అంపైర్లు... 

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో ముగించిన భారత జట్టు, సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్సీలో యంగ్ ప్లేయర్లతో నేటి నుంచి వన్డే సిరీస్ ఆడుతోంది. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు టీమిండియా ఆడుతున్న ఆఖరి సిరీస్ ఇదే. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ కోసం భారత ప్రధాన జట్టు ఆస్ట్రేలియా చేరడంతో మిగిలిన ప్లేయర్లతో వన్డే సిరీస్ ఆడుతోంది భారత జట్టు...

నేటి మ్యాచ్ ద్వారా రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు యంగ్ స్పిన్నర్ రవి భిష్ణోయ్ కూడా వన్డేల్లో ఆరంగ్రేటం చేస్తున్నారు. పొట్టి ప్రపంచ కప్‌కి రిజర్వు ప్లేయర్లుకు ఎంపికైన శ్రేయాస్ అయ్యర్, దీపక్ చాహార్, రవి భిష్ణోయ్...ఈ  వన్డే సిరీస్‌లో పాల్గొంటున్నారు. జస్ప్రిత్ బుమ్రాకి సరైన రిప్లేస్‌మెంట్ అవుతాడని అనుకుంటున్న దీపక్ చాహార్‌కి నేటి మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కలేదు....

దీపక్ చాహార్‌కి అవసరమైనంత ప్రాక్టీస్ దక్కుతుందనే ఉద్దేశంతో వన్డే సిరీస్‌కి ఎంపిక చేసినా అతనికి తుదిజట్టులో చోటు దక్కకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆవేశ్ ఖాన్, మహ్మద్ సిరాజ్‌తో పాటు టీ20లకు దూరమైన ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కి తుదిజట్టులో చోటు దక్కింది.

ఈ ఏడాది ఆరంభంలో కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో సౌతాఫ్రికా టూర్‌లో వన్డే సిరీస్ ఆడిన భారత జట్టు వన్డే సిరీస్‌ని 3-0 తేడాతో చిత్తుగా ఓడింది. దీంతో ఆ పరాజయానికి శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని భారత జట్టు ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందనేది ఆసక్తి కరంగా మారింది...

మరోవైపు సౌతాఫ్రికా మాత్రం టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడే ప్రధాన టీమ్‌తోనే వన్డే సిరీస్ ఆడుతోంది. క్వింటర్ డి కాక్, డేవిడ్ మిల్లర్, జన్నేమన్ మలాన్, అయిడిన్ మార్క్‌రమ్‌తో పాటు టీ20 సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన సౌతాఫ్రికా కెప్టెన్ తెంబ భవుమా ఈ వన్డే సిరీస్‌లో ఎలా ఆడతాడని ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూస్తున్నారు సఫారీ క్రికెట్ ఫ్యాన్స్...

భారత జట్టు: శిఖర్ ధావన్, శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి భిష్ణోయ్, మహమ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్

సౌతాఫ్రికా జట్టు: క్వింటన్ డి కాక్, తెంబ భవుమ, అయిడిన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసేన్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడా, లుంగి ఎంగిడి, తంబ్రేజ్ షంసీ

Follow Us:
Download App:
  • android
  • ios