Asianet News TeluguAsianet News Telugu

INDvsNZ 1st Test: టాస్ గెలిచిన అజింకా రహానే... శ్రేయాస్ అయ్యర్‌కి అవకాశం...

India vs New Zealand 1st Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా... టెస్టు ఎంట్రీ ఇస్తున్న శ్రేయాస్ అయ్యర్...

INDvsNZ 1st Test:  Team India won the toss and choose to bat, Shreyas Iyer debut test
Author
India, First Published Nov 25, 2021, 9:06 AM IST

కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. టీ20 సిరీస్‌లో రోహిత్ శర్మ వరుసగా మూడు టాస్‌లు గెలిస్తే, టెస్టుల్లో అజింకా రహానే కూడా మొదటి మ్యాచ్‌లో ఆ ఆనవాయితీని కొనసాగించాడు. 

నేటి మ్యాచ్ ద్వారా శ్రేయాస్ అయ్యర్, టెస్టు ఆరంగ్రేటం చేస్తున్నారు. శ్రేయాస్ అయ్యర్‌కి భారత మాజీ క్రికెటర్, ‘లిటిల్ మాస్టర్’ సునీల్ గవాస్కర్ టెస్టు క్యాప్ అందించారు. సునీల్ గవాస్కర్ ఇచ్చిన టెస్టు క్యాప్‌ను శ్రేయాస్ అయ్యర్ తీసుకుని, ముద్దు పెట్టుకోవడం విశేషం. 

భారత సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, కెఎల్ రాహుల్ లేకుండా టెస్టు మ్యాచ్ ఆడుతోంది భారత జట్టు. టెస్టు సిరీస్‌కి ఎంపికైన కెఎల్ రాహుల్, సిరీస్ ఆరంభానికి ముందు గాయంతో జట్టుకి దూరమయ్యాడు. అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను టెస్టు సిరీస్ జట్టులో జోడించింది భారత జట్టు...

విరాట్ కోహ్లీ గైర్హజరీతో కాన్పూర్ టెస్టులో భారత జట్టు, అజింకా రహానే కెప్టెన్సీలో మ్యాచులు ఆడనుంది. ఇప్పటిదాకా నాలుగు టెస్టు మ్యాచుల్లో టీమిండియాకి కెప్టెన్సీ చేసిన అజింకా రహానే, మూడు విజయాలు అందించాడు. రహానే కెప్టెన్సీలో ఆడిన సిడ్నీ టెస్టు డ్రాగా ముగిసింది. 

ఈ ఏడాది మార్చి నెలలో స్వదేశంలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడిన టీమిండియా, 8 నెలల తర్వాత మళ్లీ టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. కాన్పూర్ వేదికగా ఐదేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ జరుగుతోంది.  

టీ20 వరల్డ్ కప్ 2021 ఫైనల్ మ్యాచ్ తర్వాత జరిగిన టీ20 సిరీస్‌ నుంచి రెస్టు తీసుకున్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్, స్టార్ పేసర్ కేల్ జెమ్మీసన్... తిరిగి టెస్టుల్లోకి ఎంట్రీీ ఇచ్చారు. కివీస్ సీనియర్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్‌ కూడా తొలి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. 

టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి ఎంట్రీ ఇవ్వగా.. టీ20 సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్‌లతో పాటు జడేజా స్పిన్ భారాన్ని మోయనున్నారు. న్యూజిలాండ్ జట్టు నుంచి భారత సంతతి ఆటగాడు రచిన్ రవీంద్ర నేటి మ్యాచ్ ద్వారా టెస్టు ఆరంగ్రేటం చేస్తున్నాడు. 

భారత జట్టు: శుబ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే, శ్రేయాస్ అయ్యర్, వ‌ృద్ధిమాన్ సాహా, రవీంద్ర జడేజా,అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్

న్యూజిలాండ్ : టామ్ లాథమ్, విల్ యంగ్, కేన్ విలియంసన్, రాస్ టేలర్, హెన్నీ నికోలస్, టామ్ బ్లండెల్, రచిన్ రవీంద్ర, టిమ్ సౌథీ, అజజ్ పటేల్, కేల్ జెమ్మీసన్, విలియం సోమర్‌విల్లే

 

Follow Us:
Download App:
  • android
  • ios