INDvsNZ 1st Semi Final: గాయంతో పెవిలియన్‌కి శుబ్‌మన్ గిల్... క్రీజులోకి శ్రేయాస్ అయ్యర్!
2023 వన్డే వరల్డ్ కప్‌లో 600+ పరుగులు చేసిన మొదటి బ్యాటర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ.. 79 పరుగులు చేసి రిటైర్డ్ హార్ట్‌గా పెవిలియన్ చేరిన శుబ్‌మన్ గిల్..
ముంబైలో జరుగుతున్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ రిటైర్ట్ హార్ట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో భారీ స్కోరు దిశగా సాగుతున్న భారత జట్టుకి ఊహించని షాక్ తగిలింది..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకి రోహిత్ శర్మ మెరుపు ఆరంభం అందించాడు. 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 47 పరుగులు చేసిన రోహిత్ శర్మ, మరోసారి హాఫ్ సెంచరీకి ముందు అవుట్ అయ్యాడు. ఈ వరల్డ్ కప్‌లో ఇలా 40+ స్కోర్లు చేసి అవుట్ కావడం రోహిత్‌కి నాలుగోసారి..
వరల్డ్ కప్‌లో 50 సిక్సర్లు అందుకున్న రోహిత్ శర్మ, ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి బ్యాటర్‌గా వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. రోహిత్ అవుట్ అయ్యాక శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ కలిసి రెండో వికెట్‌కి 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
శుబ్‌మన్ గిల్ వేగంగా ఆడుతుంటే మరో ఎండ్‌లో విరాట్ కోహ్లీ నెమ్మదిగా ఆడుతూ స్ట్రైయిక్ రొటేట్ చేయడానికే ప్రాధాన్యం ఇచ్చాడు. 65 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ తొడ కండరాలు పట్టేయడంతో పెవిలియన్ చేరాడు..
వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో హాఫ్ సెంచరీ చేసిన రెండో భారత ఓపెనర్‌గా నిలిచాడు శుబ్‌మన్ గిల్. ఇంతకుముందు 1996, 2003, 2011 సెమీ ఫైనల్స్‌లో సచిన్ టెండూల్కర్ మాత్రమే 50+ స్కోర్లు చేశాడు. మరోవైపు విరాట్ కోహ్లీ, 2023 వన్డే వరల్డ్ కప్‌లో 600+ పరుగులు చేసిన మొదటి బ్యాటర్‌గా నిలిచాడు.. 25 ఓవర్లు ముగిసే సమయానికి 1 వికెట్ కోల్పోయి 178 పరుగులు చేసింది భారత జట్టు..