టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ... సూపర్ ఫామ్‌లో విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్! వన్డేల్లో ఫెయిల్ అవుతున్న సూర్యకుమార్ యాదవ్‌పైనే అందరి ఫోకస్..
శ్రీలంకతో వన్డే సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు, న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కి సిద్ధమైంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. హైదరాబాద్‌లో దాదాపు నాలుగేళ్ల తర్వాత జరుగుతున్న వన్డే మ్యాచ్ కావడంతో పిచ్ ఎలా స్పందిస్తున్నదే ఆసక్తికరంగా మారింది. ఉప్పల్ స్టేడియంలో తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 278 పరుగులు...
భారత జట్టు, లంకపై వన్డే సిరీస్ గెలిస్తే, పాకిస్తాన్ పర్యటనలో 2-1 తేడాతో వన్డే సిరీస్‌ని సొంతం చేసుకుని ఇండియాలో అడుగుపెట్టింది న్యూజిలాండ్. అయితే ట్రెంట్ బౌల్ట్‌తో పాటు కెప్టెన్ కేన్ విలియంసన్, సీనియర్ పేసర్ టిమ్ సౌథీ... ఇండియా టూర్‌కి దూరంగా ఉన్నారు...
అలాగే స్టార్ బౌలర్లు మ్యాట్ హెన్రీ, కేల్ జెమ్మీసన్ కూడా గాయాలతో ఇండియా టూర్‌కి దూరమయ్యారు. సీనియర్ స్పిన్నర్ ఇష్ సోదీ గాయంతో బాధపడుతూ తొలి వన్డేలో బరిలో దిగడం లేదు. దీంతో న్యూజిలాండ్ జట్టు కాస్త బలహీనపడ్డట్టుగా కనిపిస్తోంది...
మరోవైపు భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు వన్డేల్లో రెండు సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, అదే జోరును న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో కొనసాగిస్తాడా? అనేది చూడలి..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చాలారోజులుగా సెంచరీ మార్కును అందుకోలేకపోతున్నాడు. హాఫ్ సెంచరీలు చేస్తున్నా, మంచి ఆరంభం దక్కుతున్నా దాన్ని భారీ స్కోరుగా మలచడంలో రోహిత్ విఫలమవుతున్నాడు. 2021 నవంబర్‌లో టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ, ఇప్పటిదాకా 50 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క శతకం కూడా నమోదు చేయలేకపోయాడు...
ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ టాప్‌లో ఉంది. భారత జట్టు నాలుగో స్థానంలో ఉంది. అయితే మూడు వన్డేల సిరీస్‌ని 3-0 తేడాతో గెలిస్తే టీమిండియా టాప్ ప్లేస్‌కి ఎగబాకే అవకాశం ఉంటుంది. శ్రేయాస్ అయ్యర్ గాయంతో వన్డే సిరీస్‌కి దూరం కావడంతో వన్డేల్లో వరుసగా విఫలమవుతూ వస్తున్న సూర్యకుమార్ యాదవ్‌పైనే ఫోకస్ అంతా మళ్లింది...
గత ఏడాది వన్డేల్లో అట్టర్ ఫ్లాప్ అయిన సూర్యకుమార్ యాదవ్, నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చే అవకాశం ఉంది. బంగ్లాతో వన్డేలో డబుల్ సెంచరీ బాదిన ఇషాన్ కిషన్ నేటి మ్యాచ్‌లో మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్‌కి రాబోతున్నాడు.
భారత జట్టు: రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ
న్యూజిలాండ్ జట్టు: ఫిన్ ఆలెన్, డివాన్ కాన్వే, హెన్రీ నికోలస్, డార్ల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మైకెల్ బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్, హెన్రీ సిప్లీ, లూకీ ఫర్గూసన్, బ్లెయిర్ టిక్నర్