Asianet News TeluguAsianet News Telugu

INDvsENG 3rd Test: తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా... లంచ్ బ్రేక్‌కి ముందు...

లంచ్ బ్రేక్‌కి ముందు వేసిన ఆఖరి బంతికి కెఎల్ రాహుల్ వికెట్ కోల్పోయిన టీమిండియా...  ఇంకా ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకి 320 పరుగుల దూరంలో భారత జట్టు...

INDvsENG 3rd Test: India lost first Wicket just before Lunch in Third Day
Author
India, First Published Aug 27, 2021, 5:39 PM IST

మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. భారత జట్టులో మంచి ఫామ్‌లో ఉన్న కెఎల్ రాహుల్, మరోసారి నిరుత్సాహపరిచాడు. లంచ్ బ్రేక్‌కి ముందు వేసిన ఆఖరి బంతికి కెఎల్ రాహుల్ వికెట్ కోల్పోయి 34 పరుగులు చేసింది టీమిండియా... ఇంకా ఇంగ్లాండ్ స్కోరుకి 320 పరుగుల దూరంలో ఉంది భారత జట్టు. 

ఇంగ్లాండ్ జట్టును 432 పరుగులకి ఆలౌట్ చేసిన తర్వాత బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియాకి శుభారంభం దక్కుతున్నట్టే అనిపించింది. ఓవర్టన్ బౌలింగ్‌లో ఓసారి అంపైర్ అవుట్ ఇచ్చినా, రివ్యూకి వెళ్లి బతికిపోయిన కెఎల్ రాహుల్, ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు.

మొదటి వికెట్‌కి 115 బంతుల్లో 34 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత రాహుల్ వికెట్ కోల్పోయింది భారత జట్టు. 54 బంతులు ఆడిన కెఎల్ రాహుల్, ఒక్క బౌండరీ కూడా లేకుండా 8 పరుగులు చేశాడు. మరో ఎండ్‌లో రోహిత్ శర్మ మాత్రం తన స్టైల్‌లో ఆడుతున్నాడు. 

61 బంతులు ఆడిన రోహిత్ శర్మ, 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 105 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ, తన స్టైల్‌కి విరుద్ధంగా డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించి 19 పరుగులు చేసి, టీమిండియా తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకి ఆలౌట్ అయిన భారత జట్టు, ఇన్నింగ్స్‌ తేడాతో ఓటమి నుంచి తప్పించుకోవాలంటే ఇంకా 320 పరుగులు చేయాల్సి ఉంటుంది... వాతావరణం కూడా ఇంగ్లాండ్‌కి అనుకూలంగా ఉండడంతో భారత జట్టు, ఈరోజు మిగిలిన రెండు సెషన్లలో ఎలా బ్యాటింగ్ చేస్తున్నదనేది చాలా కీలకంగా మారింది.

Follow Us:
Download App:
  • android
  • ios