Asianet News TeluguAsianet News Telugu

INDvsAUS 3rd T20I: డిసైడర్‌లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ... వరల్డ్ కప్‌ టీమ్‌తో టీమిండియా...

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ... రిషబ్ పంత్ స్థానంతో భువనేశ్వర్ కుమార్ జట్టులోకి...

INDvsAUS 3rd T20I: Team India won the toss and elected to bowl first
Author
First Published Sep 25, 2022, 6:34 PM IST

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచి భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌కి ఆతిథ్యం ఇస్తోంది.  

ఇప్పటికే మొహాలీలో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా, నాగ్‌పూర్‌లో జరిగిన రెండో టీ20లో టీమిండియా గెలిచి 1-1 తేడాతో సమంగా ఉన్నాయి. దీంతో నేటి మ్యాచ్‌ సిరీస్ విజేతను తేల్చనుంది. గత మ్యాచ్‌లో అదిరిపోయే బ్యాటింగ్‌తో మ్యాచ్ ఫినిష్ చేసిన రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా బీభత్సమైన ఫామ్‌లో ఉన్నారు...

జస్ప్రిత్ బుమ్రా గాయం నుంచి కోలుకుని నాగ్‌పూర్ టీ20లో టీమ్‌తో కలిశాడు. దీంతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఆడబోయే స్టార్ ప్లేయర్లు అంతా కలిసి నేటి మ్యాచ్‌లో బరిలో దిగబోతున్నారు. ఆసియా కప్ 2022 టోర్నీలో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత రెండు మ్యాచుల్లోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో విరాట్ ఫ్యాన్స్, నేటి మ్యాచ్‌లో అతని నుంచి ఓ టాప్ క్లాస్ ఇన్నింగ్స్ రావాలని కోరుకుంటున్నారు...

2019లో వెస్టిండీస్‌తో హైదరాబాద్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో రోహిత్ శర్మ 50 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 94 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆసియా కప్ 2022 టోర్నీలో ఆఫ్ఘాన్‌పై సెంచరీ చేయడానికి ముందు విరాట్ కోహ్లీకి టీ20ల్లో ఇదే అత్యధిక స్కోరు. దీంతో బాగా అచొచ్చిన గ్రౌండ్‌లో విరాట్ కోహ్లీ ఎలా రాణిస్తాడోనని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు...

యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి రెస్ట్ ఇచ్చిన టీమిండియా మేనేజ్‌మెంట్, అతని ప్లేస్‌లో భువనేశ్వర్ కుమార్‌ని తిరిగి జట్టులోకి చేర్చింది. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఎక్కువ మ్యాచులు ఆడతారని ఆశిస్తున్న ప్లేయర్లు అందరూ నేటి మ్యాచ్‌లో బరిలో దిగుతున్నారు. 

భారత జట్టు : కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, యజ్వేంద్ర చాహాల్

ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్, కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, టిమ్ డేవిడ్, జోష్ ఇంగ్లీష్, మాథ్యూ వేడ్, డానియల్ సామ్స్, ప్యాట్ కమ్మిన్స్, ఆడమ్ జంపా, జోష్ హజల్‌వుడ్ 

Follow Us:
Download App:
  • android
  • ios