Asianet News TeluguAsianet News Telugu

INDvsAUS 1st Test: టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా...

ఆడిలైడ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య మొట్టమొదటి డే నైట్ టెస్టు...

టీమిండియాకి రెండో పింక్ బాల్ టెస్టు... ఇంతకుముందు బంగ్లాదేశ్‌లో డే నైట్ టెస్టు ఆడిన భారత జట్టు...

INDvsAUS 1st Test:Team India Won the toss and elected to bat first CRA
Author
India, First Published Dec 17, 2020, 9:08 AM IST

INDvAUS 1st Test: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఆడిలైడ్ వేదికగా జరుగుతున్న మొట్టమొదటి డే- నైట్ టెస్టులో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్ల మధ్య 1947 నుంచి ఇప్పటిదాకా 98 టెస్టు మ్యాచులు జరిగగా... ఇది మొట్టమొదటి పింక్ బాల్ టెస్టు.

ఈ మ్యాచ్ ద్వారా ఆస్ట్రేలియా యంగ్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ టెస్టు ఆరంగ్రేటం చేస్తున్నాడు. మరోవైపు టీమిండియా మొదటి టెస్టుకి ఒకరోజు ముందే తుది జట్టును ప్రకటించింది.

భారత జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింకా రహానే (వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పృథ్వీషా, ఛతేశ్వర్ పూజారా, హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్

ఆస్ట్రేలియా జట్టు:
జో బర్న్స్, మాథ్యూ వేడ్, లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ (కెప్టెన్), కామెరూన్ గ్రీన్, టిమ్ పైన్, ప్యాట్ కమ్మిన్స్, స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హజల్‌వుడ్ 

 

Follow Us:
Download App:
  • android
  • ios