టీమిండియా యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్ విశ్వరూపం  చూపించాడు. తన బ్యాటింగ్ ఝులిపించాడు. ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి  టెస్టు తొలి ఇన్నింగ్స్ లో జట్టు స్కోరు 432 పరుగుల వద్ద మయాంక్ అగర్వాల్ రూపంలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. మయాంక్ ఈ మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేశాడు. మొత్తం 28 ఫోర్లు, 8 సిక్సులతో 243 పరుగులు చేసి చెలరేగిపోయాడు.

ఇటీవలే దక్షిణాఫ్రికాతో ముగిసిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో సైతం విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో ఆడిన తొలి టెస్టులో మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. 12 ఇన్నింగ్స్‌ల్లోనే మయాంక్ రెండు డబుల్ సెంచరీలు సాధించి అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. మయాంక్ ప్రదర్శనపై కెప్టెన్ కోహ్లీ సంతోషంగా ఉన్నాడు.

మయాంక్ అగర్వాల్ భారీ సిక్సర్‌తో డబుల్ సెంచరీ పూర్తి చేసుకుని అనంతరం ఆకాశం వైపు చూస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఆ తర్వాత టీమిండియా డ్రెస్సింగ్‌ రూమ్‌ వైపు బ్యాట్‌ చూపిస్తూ అభివందనం చేశాడు. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌ వైపు చూస్తూ డబుల్ సెంచరీ చేశానని చేతివేళ్లతో కెప్టెన్‌ కోహ్లీకి సైగలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

అయితే... ఆ వీడియోలో మయాంక్ డబుల్ సెంచరీ చేశానంటూ రెండు వేళ్లు కోహ్లీ  కి  చూపించగా.. కోహ్లీ మూడు వేళ్లు చూపించాడు. అంటే.... త్రిబుల్ సెంచరీ చేయాల్సిందిగా కోరాడు. అయితే 243 పరుగుల వద్ద మయాంక్ ఔౌట్ అవ్వడంతో పెవిలియన్ బాట పట్టాడు.  ఈ వీడియో ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుండగా.. నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

You asked for it you got it 😎😎 Skipper asking for more 😁😁 300 possible? 🤔 #TeamIndia #INDvBAN @paytm

A post shared by Team India (@indiancricketteam) on Nov 15, 2019 at 2:34am PST

 

కోహ్లీ అడిగింది డబుల్ సెంచరీ కాదు మయాంక్.. త్రిబుల్ సెంచరీ అని పేర్కొంటున్నారు. మరికొందరు మాత్రం.. మయాంక్ అద్భుతంగా ఆడాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నాడు.