ఇండోర్ వన్డేలో టీమిండియా వన్‌సైడ్ విక్టరీ... మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్ కైవసం...

వరుసగా రెండో వన్డేలో గెలిచి 2-0 తేడాతో ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా... వన్డే నెం.1 ర్యాంకుని కాపాడుకున్న భారత జట్టు.. 

Indore India beats Australia in 2nd ODI, wins ODI series before final, Steve Smith CRA

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు టీమిండియా జోరు కొనసాగుతోంది. ఆసియా కప్ 2023 టోర్నీ గెలిచిన భారత జట్టు, సీనియర్లు లేకుండా ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. తొలి వన్డేలో భారీ లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా, రెండో వన్డేలో 99 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది... ఆస్ట్రేలియా 28.2 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌట్ అయ్యింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం లక్ష్యం మారడంతో ఓటమి తేడా తగ్గింది కానీ లేకుండా టీమిండియాకి 182 పరుగుల తేడాతో భారీ విజయం దక్కి ఉండేది.. 

400 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియాకి రెండో ఓవర్‌లో డబుల్ షాక్ తగిలింది. 8 బంతుల్లో 2 ఫోర్లతో 9 పరుగులు చేసిన మాథ్యూ షార్ట్, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో అశ్విన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికి స్టీవ్ స్మిత్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు స్టీవ్ స్మిత్..

వన్డేల్లో స్టీవ్ స్మిత్‌కి ఇది రెండో గోల్డెన్ డకౌట్. ఇంతకుముందు 2017లో పాక్ మాజీ పేసర్ మహ్మద్ ఆమీర్, స్టీవ్ స్మిత్‌ని గోల్డెన్ డకౌట్ చేశాడు. 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాని డేవిడ్ మార్నర్, మార్నస్ లబుషేన్ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు.

ఆసీస్ 9 ఓవర్లలో 56 పరుగులు చేసిన సమయంలో వర్షం కారణంగా గంటకు పైగా ఆట నిలిచిపోయింది. తిరిగి ప్రారంభమైన తర్వాత ఆస్ట్రేలియా లక్ష్యాన్ని డీఎస్‌ఎస్ విధానం ప్రకారం 33 ఓవర్లలో 317 పరుగులుగా నిర్ణయించారు అంపైర్లు. 

రెయిన్ బ్రేక్ తర్వాత వరుస వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా.  31 బంతుల్లో 4 ఫోర్లతో 27 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్, అశ్విన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 39 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 53 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అదే ఓవర్‌లో జోష్ ఇంగ్లీష్‌ని కూడా అశ్విన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు..

12 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసిన అలెక్స్ క్యారీ, జడ్డూ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 13 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేసిన కామెరూన్ గ్రీన్ రనౌట్ అయ్యాడు. 5 పరుగులు చేసిన ఆడమ్ జంపా కూడా జడ్డూ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు..

140 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. అయితే సీన్ అబ్బాట్, జోష్ హజల్‌వుడ్ కలిసి భారత బౌలర్లపైకి ఎదురుదాడికి దిగారు. 44 బంతుల్లో 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, ఓటమి తేడాని తగ్గించగలిగారు. 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 23 పరుగులు చేసిన జోష్ హజల్‌వుడ్‌ని మహ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. 36 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 54 పరుగులు చేసిన సీన్ అబ్బాట్‌ని జడ్డూ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కి తెరబడింది. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 399 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 8 పరుగులకే అవుటైనా శ్రేయాస్ అయ్యర్, శుబ్‌మన్ గిల్ సెంచరీలతో చెలరేగగా కెఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ చేశాడు. ఇషాన్ కిషన్ ఇరగదీయగా సూర్యకుమార్ యాదవ్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తన ప్రతాపం చూపించాడు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios