వేల మంది జనాలుండే క్రికెట్ స్టేడియంలో ప్రేమికులు హాజరకావటం, చుట్టూ జనం ఉన్న విషయం కూడా మరిచిపోయి ముద్దుల్లో తేలిపోవడం చాలా మ్యాచుల్లో జరిగేదే. కానీ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో మాత్రం ఓ రొమాంటిక్ సంఘటన జరిగింది.

ఇండియాకు చెందిన ఓ యువకుడు, తన గర్ల్‌ఫ్రెండ్ అయిన ఆస్ట్రేలియన్ యువతికి స్టేడియంలో ప్రపోజ్ చేశాడు. ఈ దృశ్యాలను కెమెరామెన్ కెమెరాలో బంధించాడు. ఇండియన్ యువకుడు ప్రపోజ్ చేసిన విధానానికి షాక్ అయిన ఆ ఆస్ట్రేలియన్ యువతి, అతని ప్రేమను అంగీకరించింది. అతన్ని హగ్ చేసి ప్రేమగా ముద్దాడింది.

ఈ వీడియో స్క్రీన్లలో కనిపించడంతో ఆస్ట్రేలియన్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా చప్పట్లతో అభినందనలు తెలిపాడు. ఆతిథ్య ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను పడకొట్టడంలో భారత బౌలర్లు ఇబ్బంది పడుతున్న సమయంలో ఓ ఇండియన్, ఆస్ట్రేలియన్‌ను ఈజీగా పడేసాడంటూ దీనిపై మీమ్స్ కూడా చేస్తున్నారు కొందరు నెటిజన్లు.