ఐసిసి ప్రపంచ కప్ 2019 టోర్నీ మరో నెల రోజుల్లో ఆరంభం కానుంది. అయితే ఈ మెగా టోర్నీలో పాల్గోనే జట్లు మైదానంలో ఆటతో పోటీ పడే ముందే మాటల పోటీని మొదలుపెట్టాడు.  దాయాది దేశాలపై భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఈ మాటల యుద్దం కొనసాగుతోంది. ఇటీవల పాకిస్థాన్ కెప్టెన్ సర్పరాజ్ ప్రపంచ కప్ లో  టీమిండియాతో ఆడనున్న మ్యాచ్ పై స్పందిస్తూ కాస్త వెటకారంగా మాట్లాడాడు. అయితే అతడి వ్యాఖ్యలపై టీమిండియా  ఆటగాళ్లెవరూ స్పందించక పోయినా అభిమానులు మాత్రం సర్పరాజ్ పై సోషల్ మీడియా మాద్యమాల్లో విరుచుకుపడుతున్నారు. 

ప్రపంచ కప్ కు ఆతిథ్యమివ్వనున్న ఇంగ్లాండ్ జట్టులో పాకిస్థాన్ వన్డే సీరిస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో జట్టులో కలిసి ఇంగ్లాండ్ కు బయలుదేరుతూ కెప్టెన్ సర్పరాజ్ అహ్మద్ మీడియతో మాట్లాడాడు. ప్రపంచకప్ టోర్నీలో టీమిండియాతో జరిగే మ్యాచ్ ను తామేమీ ప్రత్యేకంగా చూడటంలేదని...మిగతా జట్లతో ఆడినట్లే భారత్ తోనూ ఆడతామని తెలిపాడు. ఆ జట్టు  ఆటగాళ్లను ఎదర్కొనేందుకు ప్రత్యేక వ్యూహాలేమీ రూపొందించడం లేదన్నాడు. 

ప్రపంచ కప్ లీగ్ దశలో భాగంగా తాము ఆడే తొమ్మిది మ్యాచులు తమకు ముఖ్యమైనవేనని పేర్కొన్నాడు. తాము ఇటీవలే భారత్ ను ఐసిసి నిర్వహించిన ఓ మెగా టోర్నీలో ఓడించామంటూ వెల్లడించాడు. 2017 చాంపియన్స్ ట్రోపి ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో భారత్  ఓడిపోడాన్ని ఉద్దేశించి సర్పరాజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 

ఇలా టీమిండియాపై వెటకారంగా మాట్లాడిన సర్పరాజ్ ను అభిమానులు తెగ ట్రోల్ చేస్తున్నారు. ప్రతి మ్యాచ్ భారత్ తో ఆడినట్లుగానే భావిస్తే మీరు ప్రతి మ్యాచ్ ఓడిపోవాల్సి వస్తుందంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.  ముందు మీరు ప్రపంచ కప్ లో భారత్ పై ఒక్క మ్యాచ్ అయినా గెలిచి చూపించాలని మరోవ్యక్తి అన్నాడు. ఇప్పటివరకు ప్రపంచ కప్ టోర్నీలో భారత్-పాక్ లు ఆరుసార్లు పోటీ పడగా అన్ని మ్యాచుల్లోనూ టీమిండియాదే పైచేయిగా నిలిచింది. దీన్ని గుర్తుచేస్తు '' సర్పరాజ్ ఇంకా ఏ లోకంలో ఉన్నాడు'' అంటూ మరో అభిమాని సోషల్ మీడియాలో సర్పరాజ్  విరుచుకుపడుతున్నారు.