టీమిండియా క్రికెటర్లు.. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. మూడో టెస్టు కోసం కసరత్తులు చేస్తూనే..  ఖాళీ సమయంలో.. ఆసిస్ గడ్డపై చక్కర్లు కొడుతున్నారు. ఈ నేపథ్యంలో.. నూతన సంవత్సరం సందర్భంగా టీమిండియా క్రికెటర్లు ఓ హోటల్ కి వెళ్లారు. ఈ క్రమంలో.. ఓ అభిమాని అ క్కడ క్రికెటర్లు ఊహించని సర్ ప్రైజ్ ఇవ్వగా.. అది రోహిత్ శర్మకి అస్సలు నచ్చలేదట.

హోటల్ లో ఈ క్రికెటర్లంతా భోజనం చేయగా.. దాని బిల్లును ఇండియన్ అ భిమాని నవల్ దీప్ సింగ్ చెల్లించాడట. దీంతో.. రోహిత్ సహా ఇతర క్రికెటర్లంతా షాకయ్యారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... భారత్ కు చెందిన నవల్ దీప్ సింగ్ మెల్ బోర్న్ లో ఉంటున్నాడు. జనవరి 1న అతను ఓ హోటల్ కు వెళ్లగా.. అక్కడ రోహిత్ శర్మ, రిషబ్ పంత్, నవదీప్ సైని, శుభ్ మన్ గిల్ తనముందు టేబుల్ లో కూర్చొని ఉన్నారు. అనుకోకుండా వచ్చిన ఈ అవకాశాన్ని ఆ అభిమాని వాడుకున్నాడు.

 

ఆ క్రికెటర్ల బిల్లు మొత్తం అతనే చెల్లించాడు. క్రికెటర్లు 118 ఆస్ట్రేలియ‌న్ డాల‌ర్ల (సుమారు రూ.6700) బిల్లు చేయ‌గా.. ఆ మొత్తం తానే చెల్లించానని, ఈ విష‌యం వాళ్ల‌కు తెలియ‌ద‌ని మ‌రో ట్వీట్‌లో న‌వ‌ల్‌దీప్ చెప్పాడు. విష‌యం తెలిసిన త‌ర్వాత తాను క‌ట్టిన డ‌బ్బు తిరిగి తీసుకోవాల్సిందిగా వాళ్లు ఒత్తిడి తెచ్చార‌ని, అలా అయితేనే త‌న‌తో ఫొటో దిగుతామ‌ని కూడా పంత్ అన్నాడ‌ని అత‌డు చెప్పాడు. అయినా స‌రే తాను డ‌బ్బు తీసుకోవ‌డానికి ఒప్పుకోక‌పోవ‌డంతో ఇక చేసేది లేక వాళ్లంతా త‌న‌తో ఫొటో దిగార‌ని న‌వ‌ల్‌దీప్ అన్నాడు. కాగా.. అలా అభిమాని డబ్బులు కట్టడం రోహిత్ శర్మకు అస్సలు నచ్చలేదట. డబ్బులు తీసుకో.. ఇలా చెల్లించడం అసలు బాలేదని అని రోహిత్ శర్మ అనగా.. పంత్ మాత్రం హగ్ ఇచ్చాడట.