Asianet News TeluguAsianet News Telugu

23 ఫోర్లు, 8 సిక్సర్లతో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ కొట్టిన భార‌త క్రికెట‌ర్ షఫాలీ వర్మ

IND W vs SA W - Fastest Double Century : ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న టెస్టు మ్యాచ్ లో భార‌త ప్లేయ‌ర్లు ప‌రుగుల వ‌ర‌ద పారిస్తూ రికార్డుల మోత మోగించారు. షెఫాలీ వ‌ర్మ డ‌బుల్ సెంచ‌రీ, స్మృతి మంధాన సెంచ‌రీ, జెమిమా రోడ్రిగ్స్ హాఫ్ సెంచ‌రీతో అద‌ర‌గొట్ట‌డంతో టీమిండియా స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది. 
 

indian cricketer Shafali Verma scored fastest double century at the age of 20 with 23 fours and 8 sixes RMA
Author
First Published Jun 28, 2024, 10:47 PM IST

IND W vs SA W: భారత మహిళా క్రికెట్ జ‌ట్టు యంగ్ ప్లేయ‌ర్ షఫాలీ వర్మ చ‌రిత్ర సృష్టించింది. ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న టెస్టు మ్యాచ్ లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తూ క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించింది. దక్షిణాఫ్రికాపై టెస్ట్ క్రికెట్‌లో తన మొదటి సెంచరీని కొట్ట‌డంతో పాటు దానిని డ‌బుల్ సెంచ‌రీగా మారుస్తూ అనేక రికార్డులు సృష్టించింది. మ్యాచ్ ప్రారంభం నుంచి షఫాలీ వర్మ భిన్నమైన మూడ్‌లో క‌నిపిస్తూ ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌పై బ్యాట్ తో విరుచుకుప‌డ్డారు. ఏ బౌలరు ష‌ఫాలీని ఆప‌లేక‌పోయాడు. అయితే, 205 పరుగుల వ‌ద్ద‌ షఫాలీ దురదృష్టవశాత్తు రనౌట్ అయింది. అయితే ఈ ఇన్నింగ్స్‌తో ఆమె మహిళా క్రికెట్‌లో కొత్త అధ్యాయాన్ని లిఖించింది.

అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ కొట్టిన ష‌ఫాలీ వ‌ర్మ

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో షఫాలీ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. డబుల్ సెంచరీ అద‌ర‌గొట్టింది. కేవ‌లం 194 బంతుల్లోనే డ‌బుల్ సెంచ‌రీ సాధించింది. దీంతో మ‌హిళా టెస్టు క్రికెట్ లో అత్యంత వేగ‌వంత‌మైన డ‌బుల్ సెంచ‌రీ సాధించిన ప్లేయ‌ర్ గా ఘ‌న‌త సాధించింది. త‌న డ‌బుల్ సెంచ‌రీ ఇన్నింగ్స్ లో షఫాలీ వర్మ 23 ఫోర్లు, 8 సిక్సర్లు బాదింది. ఇది మహిళల టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ కాగా, అంతకుముందు 256 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించిన ఆస్ట్రేలియా క్రీడాకారిణి అనాబెల్ సదర్లాండ్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టింది ష‌ఫాలీ. అలాగే, భార‌త డాషింగ్ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును కూడా షెఫాలీ వ‌ర్మ  సమం చేసింది, 16 సంవత్సరాల క్రితం ఇదే మైదానంలో సెహ్వాగ్ కేవలం 194 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు.

T20 World Cup : 17 ఏళ్ల హిస్టరీలో ఇదే తొలిసారి.. ఎవరు గెలిచినా సరికొత్త చరిత్రే.. !

 

20 ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ.. 

షెఫాలీ వర్మ 20 ఏళ్ల 152 రోజుల వయసులో డబుల్ సెంచరీ సాధించింది. అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన రెండో క్రీడాకారిణిగా షెఫాలీ వ‌ర్మ‌ నిలిచింది. 2002లో మిథాలీ రాజ్ కేవలం 19 ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ సాధించింది. షెఫాలీ వర్మ 197 బంతుల్లో 205 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడ‌టంతో భార‌త భారీ స్కోర్ చేసిందిత‌. షెఫాలీతో పాటు స్మృతి మంధాన కూడా సెంచ‌రీతో సౌతాఫ్రికా బౌలింగ్ ను చిత్తుచేసింది.

తొలి రోజు అత్య‌ధిక ప‌రుగుల రికార్డు

షెఫాలీ వర్మ డబుల్ సెంచరీ, స్మృతి మంధాన సెంచరీల‌తో ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన‌ టెస్టు మ్యాచ్ తొలి రోజు భారీ స్కోర్ చేసింది టీమిండియా. టెస్ట్ క్రికెట్ లో తొలి రోజు అత్య‌ధిక ప‌రుగులు చేసిన జ‌ట్టుగా రికార్డు సృష్టించింది. షెఫాలీ వర్మ 205,  స్మృతి మంధాన 149, శుభా సతీష్ 15 ప‌రుగులు, జెమిమా రోడ్రిగ్స్ 55 ప‌రుగులు చేసి ఔట్ అయ్యారు. ప్ర‌స్తుతం హర్మన్‌ప్రీత్ కౌర్ 42* ప‌రుగులు, రిచా ఘోష్ 43* ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

 

 

చ‌రిత్ర సృష్టించిన టీమిండియా.. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios