బాస్కెట్‌బాల్ కోర్ట్‌లో ఫుట్‌బాల్ ఆడుతున్న సంజు శాంసన్.. వీడియో
Sanju Samson: భారత క్రికెటర్ సంజూ శాంసన్ తనకు దొరికిన విశ్రాంతి సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. అయితే, బాస్కెట్‌బాల్ కోర్ట్‌లో ఫుట్‌బాల్ గేమ్ ఆడుతూ కనిపించిన సంజూ శాంసన్ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.
Sanju Samson : భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ బాస్కెట్‌బాల్ కోర్టులో ఫుట్‌బాల్ ఆడుతూ కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. భారత శ్రీలంక పర్యటన ముగిసిన తర్వాత అతను ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉన్న సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. వర్షం కురవడంతో బాస్కెట్‌బాల్ కోర్ట్ కొంచెం తడిగా ఉంది. మంచి వాతావరణంతో ఉన్న వర్షపు రోజులలో స్నేహితులతో ఫుట్‌బాల్ ఆటను ఆస్వాదించడం కంటే సంతోషకరమైనది మరొకటి ఉండదు కదా.. ! సంజూ శాంసన్ కూడా ఇదే చేస్తున్నాడు.
ఇటీవల ముగిసిన శ్రీలంక పర్యటనలో సంజూ శాంసన్ భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. పల్లెకెలెలో శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు అతను భారత టీ20ఐ జట్టులో కొనసాగాడు. అయితే, పెద్ద ఇన్నింగ్స్ లను ఆడలేకపోయిన అతను వరుసగా రెండు డక్‌లను నమోదు చేశాడు. టీ20 సిరీస్‌లో శాంసన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. దీంతో శ్రీలంకతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు అతన్ని జట్టులోకి తీసుకోలేదు. శాంసన్ టీ20 ప్రపంచ కప్ 2024 విజేత భారత జట్టులో భాగంగా ఉన్నాడు కానీ రిషబ్ పంత్ టాప్ వికెట్ కీపర్-బ్యాటర్ ఎంపికగా ఉండటంతో తుది జట్టులో అతనికి ఆడే అవకాశం రాలేదు.
బీసీసీఐ శ్రీలంక పర్యటన కోసం జట్టులను ప్రకటించిన తర్వాత, అభిమానులు, చాలా మంది నిపుణులు సంజూ శాంసన్ ను వన్డే జట్టు నుంచి తప్పించడంపై విమర్శలు గుప్పించాడు. మంచి ప్రదర్శన చేస్తున్న వరుసగా ఎక్కువ మ్యాచ్ లలో ఆడే అవకాశం ఇవ్వడం లేదు. డిసెంబర్ 2023లో దక్షిణాఫ్రికాతో భారత్ ఆడిన చివరి వన్డే మ్యాచ్ లో శాంసన్ సెంచరీ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే, అవకాశం వచ్చినప్పుడు ఒకటి రెండు మ్యాచ్ లను తప్ప మిగతా మ్యాచ్ లలో రాణించకపోవడం కూడా సంజూను రెగ్యులర్ గా జట్టులో కొనసాగించడంలో బీసీసీఐ ఆసక్తి చూపడం లేదు.
సచిన్ టెండూల్కర్ లాంటి రిటైర్మెంట్ గౌరవాన్ని పొందలేకపోయిన టాప్-5 భారత స్టార్ క్రికెటర్లు