ఇండియన్ బ్రియాన్ లారా.. 404* పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడిన భారత ప్లేయర్
Prakhar Chaturvedi: కూచ్ బెహార్ ట్రోఫీ ఫైనల్లో 400 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా ప్రకర్ చతుర్వేది రికార్డు సృష్టించాడు. ధర్మానితో కలిసి 290 పరుగుల భాగస్వామ్యం, కార్తికేయ కేపీ, సమిత్ ద్రావిడ్ లతో కలిసి చెప్పుకోదగ్గ భాగస్వామ్యం నెలకొల్పాడు. చతుర్వేది తన ఇన్నింగ్స్ తో 46 బౌండరీలు, 3 సిక్సర్లతో ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
Prakhar Chaturvedi slams unbeaten 404* runs: 18 ఏండ్ల ఒక ఇండియన్ ప్లేయర్ 404* పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడి బ్రియాన్ లారా సరసన చేరాడు. అలాగే, భాతర దిగ్గజ ప్లేయర్లకు సాధ్యంకాని ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయం అందించాడు. అతనే కర్నాటక యంగ్ క్రికెటర్ ప్రకర్ చతుర్వేది. ముంబైతో జరిగిన కూచ్ బెహార్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో చతుర్వేది ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ను ఆడాడు. కేఎస్ సీఏ నవులే స్టేడియంలో ఓపెనింగ్ ఇన్నింగ్స్‌లో క్రీజులోకి వచ్చిన చతుర్వేది అసాధారణమైన నైపుణ్యాన్ని ప్రదర్శించి, అజేయంగా 404 పరుగులను సాధించాడు. అతను తన ఇన్నింగ్స్ లో అతని ఇన్నింగ్స్ లో 46 బౌండరీలు, 3 సిక్సర్లు బాది ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కర్నాటక జట్టుకు తొలి టైటిల్ ను అందించాడు.
కూచ్ బెహర్ ట్రోఫీ ఫైనల్లో చతుర్వేది భారీ ఇన్నింగ్స్ తో ఆడటంతో అండర్-19 టోర్నమెంట్లో కర్ణాటకకు తొలి టైటిల్ దక్కింది. తన అజేయ ఇన్నింగ్స్ ద్వారా చతుర్వేది భారత మాజీ దిగ్గజ ప్లేయర్ యువరాజ్ సింగ్ 24 సంవత్సరాల రికార్డు (358 పరుగులు) ను కూడా బద్దలు కొట్టాడు. ఇది కూచ్ బెహార్ టైటిల్ పోరులో మునుపటి అత్యధిక స్కోరు. శివమొగ్గలో జరిగిన ఫైనల్లో ముంబై నిర్దేశించిన 380 పరుగులకు బదులిస్తూ చతుర్వేది ఇన్నింగ్స్ తో కర్ణాటక 223 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 890 పరుగులు చేసింది.
అందరూ చూస్తుండగానే.. విరాట్ కోహ్లీ కౌగిలితో నా కల నెరవేరింది.. వైరల్ వీడియో !
తన ఇన్నింగ్స్ పై పై చతుర్వేది మాట్లాడుతూ.. 'ఇదొక గొప్ప అనుభూతి. ఫైనల్లో ఇన్నింగ్స్ వచ్చి కర్ణాటకకు తొలి టైటిల్ (కూచ్ బెహర్) సాధించడం సంతోషంగా ఉంది. కొంచెం అలసిపోయినట్లు అనిపించినా.. టైటిల్ గెలిచిన జట్టు ఆనందానికి ఏదీ సాటిరాదని'' అన్నాడు. 'నేను ఎనిమిదేళ్ల వయసులో క్రికెట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి నా కుటుంబం నుంచి ఎంతో సపోర్ట్ ఉంది. (కోవిడ్ -19) లాక్డౌన్ సమయంలో వారు ఒక ప్రైవేట్ త్రోడౌన్ నిపుణుడి సేవలను కూడా నాకు ఉపయోగించుకున్నారు. అదృష్టవశాత్తూ క్రికెట్, చదువు రెండింటిలో మెరుగ్గా ముందుకు సాగుతున్నాను' అని తెలిపాడు.
బియ్యానికి పురుగు పట్టొదంటే ఏం చేయాలి?