Asianet News TeluguAsianet News Telugu

టీమిండియా మహిళా జట్టుకు ఐసీసీ జరిమానా..!

ప్రస్తుతం భారత మహిళల జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి టీ20లో ఇంగ్లండ్‌ విజయం సాధించగా.. ఆదివారం నాటి రెండో టీ20 మ్యాచ్‌లో భారత్‌ ఎనిమిది పరుగుల తేడాతో గెలిచింది. 

India women's team fined for slow over-rate in 2nd T20I against England
Author
Hyderabad, First Published Jul 13, 2021, 3:05 PM IST

టీమిండియా మహిళల జట్టుకు ఇంటర్నేషనల్ కౌన్సిల్ (ఐసీసీ) జరిమానా విధించింది. ఇటీవల మహిళల జట్టు ఇంగ్లాండ్ తో తలపడిన సంగతి తెలిసిందే. కాగా.. రెండో టీ20లో స్లో ఓవర్ కారణంగా ఫీజులో 20శాతం కోత విధించింది.

‘‘ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్‌ 2.22 ప్రకారం నిర్ణీత సమయానికి అనుగుణంగా బౌలింగ్‌ చేయడంలో విఫలమైనందున మ్యాచ్‌ ఫీజులో 20 శాతం కోత విధిస్తున్నాం’’ అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.


కాగా ప్రస్తుతం భారత మహిళల జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి టీ20లో ఇంగ్లండ్‌ విజయం సాధించగా.. ఆదివారం నాటి రెండో టీ20 మ్యాచ్‌లో భారత్‌ ఎనిమిది పరుగుల తేడాతో గెలిచింది. దీంతో.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ 1–1 సమమైంది. ఇక రెండో టీ20లో కీలకమైన బీమాంట్‌ వికెట్‌ను తీసిన భారత వుమెన్‌ క్రికెటర్ దీప్తి శర్మ (1/18)ను ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు వరించింది. అయితే, ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేటుకు కారణమైన భారత మహిళల జట్టు జరిమానా బారిన పడింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios